తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: మొలకెత్తిన విత్తనాల్లాగే మొలకెత్తిన మెంతులు తిని చూడండి, ఎంతటి డయాబెటిస్ అయినా అదుపులో ఉండాల్సిందే

Diabetes: మొలకెత్తిన విత్తనాల్లాగే మొలకెత్తిన మెంతులు తిని చూడండి, ఎంతటి డయాబెటిస్ అయినా అదుపులో ఉండాల్సిందే

Haritha Chappa HT Telugu

17 July 2024, 13:07 IST

google News
  • Diabetes: మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మొలకెత్తిన మెంతులు తినడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. మధుమేహం అధికంగా ఉన్నవారు కచ్చితంగా మొలకెత్తిన మెంతులు తింటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఉంటాయి.

మొలకెత్తిన మెంతులు
మొలకెత్తిన మెంతులు (shutterstock)

మొలకెత్తిన మెంతులు

మెంతి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ భారతీయ వంటలలో, దీన్ని చాలా తక్కువగానే వాడతారు. కారణం దీని రుచి. ఇవి కాస్త చేదుగా ఉంటాయి. ఈ విధంగా మెంతులను తినడం వల్ల ఆరోగ్యానికి అంతగా ప్రయోజనం ఉండదు. మొలకెత్తిన విత్తనాల్లాగే మెంతిగింజలను కూడా మొలకెత్తించి తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారు ఈ మొలకెత్తిన మెంతులను తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ మెంతులను ఉదయాన్నే పరగడుపున తింటే మధుమేహం వంటి వ్యాధులను నియంత్రించడమే కాకుండా ఈ వ్యాధులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో మూలికలుగా ఉపయోగించే మెంతులను మొలకెత్తాక తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

మెంతుల్లో విటమిన్లతో పాటు మంచి మొత్తంలో మినరల్స్ కూడా ఉంటాయి. ఒక టీస్పూన్ మెంతుల్లో 3.7 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. దీని వల్ల రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది.

మెంతులు ఎందుకు తినాలి?

మెంతుల రుచి చాలా చేదుగా ఉంటుంది. అందుకే తినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. మెంతులను మొలకెత్తిన గింజలుగా మార్చుకుని తింటే రుచి కాస్త బావుంటుంది. సులభంగా జీర్ణమవుతుంది కూడా. మెంతులను పొడిగా చేసుకుని తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మెంతులను నానబెట్టి లేదా మొలకెత్తిన గింజలుగా చేసి తినడం మంచిది. మొలకలను ఏదైనా సూప్, సలాడ్ లేదా ఇతర మొలకలతో కలపడం ద్వారా సులభంగా తినవచ్చు.

ఒక నెలలో ఎనిమిది స్పూన్ల మొలకెత్తిన మెంతులను తింటే సరిపోతుందని పోషకాహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంత మొత్తంలో తినడం ద్వారా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజూ పావు స్పూను మెంతులను నానబెట్టి మొలకెత్తాక తినాలి.

మొలకెత్తిన మెంతులతో ప్రయోజనాలు

బాలింతలు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల వారికి పాలు అధికంగాఉత్పత్తి అవుతాయి. అమ్మమ్మల కాలం నుంచి పాల ఉత్పత్తికి బాలింతల చేత మెంతులను తినిపిస్తూ ఉంటారు. మెంతులను మొలకెత్తిన గింజలుగా చేయడం లేదా పానీయంగా తాగడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఇలాంటి పాలతో బిడ్డ ఎదుగుదల కూడా వేగంగా ఉంటుంది. మెంతి పానీయం తాగే మహిళలు సాధారణ తల్లి పాలిచ్చే మహిళల కంటే రెట్టింపు మొత్తంలో పాలను ఉత్పత్తి చేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

డయాబెటిస్ ఉంటే…

ఎన్నో అధ్యయనాలు మెంతులను తినడం వల్ల డయాబెటిక్ రోగులకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని తేల్చాయి. మొలకెత్తిన గింజలను రోజూ పరగడుపున తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ పావు స్పూను మొలకెత్తిన గింజలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ నిరోధకత సమస్య కూడా తగ్గుతుంది.

నెలసరి తిమ్మిరితో బాధపడే అమ్మాయిలు మొలకెత్తిన మెంతులను డైట్ లో చేర్చుకోవాలి. ఇది నెలసరి నొప్పిని తగ్గిస్తుంది. పెయిన్ కిల్లర్స్ తినాల్సిన అవసరం కూడా ఉండదు.

హార్మోన్ల సమతుల్యం

మెనోపాజ్ వచ్చిన మహిళలు మెంతులను కచ్చితంగా తినాలి. మొలకెత్తిన గింజల రూపంలో మెంతులను తినడం సులభం. వీటి ద్వారా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల హార్మోన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి.

ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో మెంతి రసం తాగడం వల్ల పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయని కనుగొన్నారు. మెంతి గింజల పానీయాన్ని 6 వారాల పాటు నిరంతరాయంగా తాగడం వల్ల సెక్స్ డ్రైవ్, లైంగిక పనితీరు పెరుగుతుందని అధ్యయనం కనుగొంది. ప్రతిరోజూ పురుషులు తమ ఆహారంలో మెంతులను చేర్చుకోవచ్చు.

అదుపులో కొలెస్ట్రాల్

మెంతులను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉండదు.

మొలకెత్తిన మెంతులను తినడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది, ఇందులో ఉండే ఫైబర్ మొత్తం పొట్ట నిండిన అనుభూతిని ఇస్తుంది. దీని వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఎక్కువ.

టాపిక్

తదుపరి వ్యాసం