తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tuesday Motivation : నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు.. జ్ఞాపకాల్లో మిగిలే ఉంటుంది

Tuesday Motivation : నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు.. జ్ఞాపకాల్లో మిగిలే ఉంటుంది

Anand Sai HT Telugu

06 February 2024, 5:00 IST

google News
    • Tuesday Motivation : నిజమైన ప్రేమలో శరీరాలు దూరంగా ఉంటాయేమో కానీ.. మనసులో మాత్రం ఎప్పుడూ దగ్గరే ఉంటాయి. దూరంగా ఉన్నంత మాత్రన బ్రేకప్ అనుకోకూడదు.
నిజమైన ప్రేమ బ్రేకప్ అవ్వదు
నిజమైన ప్రేమ బ్రేకప్ అవ్వదు (Unsplash)

నిజమైన ప్రేమ బ్రేకప్ అవ్వదు

చాలా మంది విడిపోవడం అంటే బ్రేకప్ అనే అర్థం చెబుతారు. కానీ మీరు ప్రేమించిన వాళ్లు సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమ. పరిస్థితు తారుమారు అయితే వాళ్లు వేరేవారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీ మీద ఆలోచనలు మాత్రం చావనివ్వరు. అది ఎన్నాళ్లైనా అలానే ఉంటాయి. మీతో గడిపిన క్షణాలు.. నిన్న జరిగిన విషయల్లాగే అనిపిస్తాయి. అందుకే నిజమైన ప్రేమకు చావు ఉండదు, బ్రేకప్ కూడా అవ్వదు. ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథలన్నీ దేహాలుగా దూరమైనవే.. మనసులుగా మాత్రం ఎప్పుడు దగ్గరే.

అందుకే ఆ ప్రేమ కథలను ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటాం. లైలా మజ్నూ, పార్వతీ దేవదాసు.. వీళ్లు విడిపోయినా.. ప్రేమలో కలిసి ఉన్నారనే వారి పేర్లు ఇప్పటి గుర్తుచేసుకుంటాం. ప్రేమంటే ఒకే ఇంట్లో కలిసి ఉండటం కాదు.. వేర్వేదు శరీరాలైనా మనసులు మాత్రం ఒక్కటే అయి ఉండటం.

బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు.. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. ఎంత దూరంలో ఉన్న ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు ఉండాలి. ప్రేమలో గెలవడం అంటే వారిని పొందడం మాత్రమే కాదు.. ప్రేమించిన వ్యక్తి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడం. అవసరాల కోసం ప్రేమించినవారు ఏదో ఒకరోజు దూరం అవుతారేమో కానీ.. మనసుతో ప్రేమించిన వారు ఎప్పటికీ మీ మనసులోనే ఉంటారు.

నిజంగా ప్రేమించిన వారు ప్రతీ రోజు మిమ్మల్ని కలవలేకపోవచ్చు.. కానీ ప్రతీ క్షణం మీ గురించే ఆలోచిస్తారు. ప్రతీ నిమిషం మీతో మాట్లాడలేకపోవచ్చు.. కానీ మీతో మాట్లాడే ఒక్క నిమిషం కోసం ఎదురుచూస్తునే ఉంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమకు చావు ఉండదు. మీరు ఏంటో వారికి పూర్తిగా తెలిసి ఉంటుంది. మీకు వారు దూరంగా ఉన్నా.. మనసులో మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు.

చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు.. ఇవన్నీ అందరికీ కనిపించవు. కానీ మీరు నిజంగా ప్రేమించిన వారి దగ్గరే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వారే మీకు అద్దంలాంటివారు. కానీ బ్రేకప్ చెప్పాలనుకునేది ప్రేమ కాదు కేవలం ఆకర్శణే. అలాంటివారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. వారు మీ బాధలను కూడా అర్థం చేసుకోరు. మీ ఆనందంలో మాత్రమే తోడుంటారు. కష్టంలో మీతో కలిసి నడవరు.

నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా.. నిద్రపోయేందుకు ముందు చివరి ఆలోచన.. లేచాక మెుదటి ఆలోచన వారిదే ఉండాలి. ప్రేమంటే కలిసే ఉండాలనీ రూలేమీ లేదు.. విడిపోయినా మనసులు కలిసి ఉంటే కూడా ప్రేమే.

ఒక అమ్మాయి ప్రేమికుడికి దూరం అయిందంటే.. వాడి మీద ప్రేమ లేక కాదు.. తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుందని అర్థం..

అలాగే

ఒక అబ్బాయి ప్రియురాలికి దూరం అయితే అన్నీ అయిపోయాయని అర్థం కాదు.. తన ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నాడని అర్థం..

అలాంటి ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా.. ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచన వచ్చిన ప్రతీసారి మళ్లీ.. మళ్లీ ప్రేమలో పడతారు.

తదుపరి వ్యాసం