చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కనుంది? సీఎం మనసులో మాట ఇదేనా?
చేవెళ్ల లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఎవరికి దక్కనుంది? పార్లమెంట్ ఎలక్షన్లకు సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీలో ఈ సీటు అభ్యర్థిత్వంపై ఉత్కంఠ నెలకొంది.
మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలోని వివిధ లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థిత్వాలపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పీఠం ఎక్కిన కాంగ్రెస్ నుంచి అభ్యర్థిత్వాలకు ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది.
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బాధ్యతలు స్వయంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి డాక్టర్ రంజిత్ రెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో తనదైన శైలిలో ప్రజలతో మమేకమయ్యారు. ఈనేపథ్యంలో ఇక్కడి నుంచి ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణలో పడింది. పార్టీ తరుపున ఎవరిని బరిలో నిలపాలనే దానిపై కసరత్తు నడుస్తోంది.
వలస నేతలపై రేవంత్ విముఖత
అయితే ఈ క్రమంలోనే బీఆర్ఎస్‌కు చెందిన ఓ ముఖ్యనేత తన భార్యకు కాంగ్రెస్ టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. అలాగే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కించుకోవచ్చని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. అయితే వీరిలో కొండా ముఖ్యమంత్రికి సన్నిహిత నేత అయినప్పటికీ, వీరిరువురితో సహా ఇతర పార్టీల నుంచి వలస వచ్చే నేతలకు లోక్‌సభ ఎన్నికల సమయంలో అభ్యర్థిత్వం కట్టబెట్టడం సరికాదన్న భావనలో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా నేతలను కాంగ్రెస్‌లోకి స్వయంగా రేవంత్ రెడ్డి ప్రయత్నించినా, కాంగ్రెస్ విజయంపై నమ్మకం లేక ఆయా నేతలు రాలేదు. కానీ సీను మారిపోయి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది.
ఈనేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు మెరుగుపడ్డాయని ఆయా నేతలు ఆలోచించి ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి వీరి రాకను స్వాగతించేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాకపోవడమే అందుకు కారణంగా పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి.
ఇక కాంగ్రెస్‌లోనే ఉన్న పలువురు సీనియర్ నేతలు, అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడి ఓటమిపాలైన అభ్యర్థులు లోక్‌సభ అభ్యర్థిత్వం దక్కుతుందనే ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచే ఒకరికి టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని స్థానిక నేతలు
టాపిక్