Travel Bucket List of 2023 : ఇండియాలో మీరు వెళ్లాల్సిన టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే.
30 December 2022, 10:33 IST
- Travel Bucket List of 2023 : ఎక్కడికైనా వెళ్లాలని.. ఎలా అయినా ఈ సంవత్సరం కొన్ని ప్రదేశాలకు వెళ్లాలని చాలా సార్లు అనుకునే ఉంటాము. కానీ పలు కారణాల వల్ల మనం వెళ్లి ఉండకపోవచ్చు. అయితే 2023లో అయినా ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే.. మీకోసం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే..
ట్రావెల్ డెస్టినేషన్స్
Travel Bucket List of 2023 : కనీసం 2023లో అయినా.. మీరు పలు ప్రదేశాలను చుట్టి రావాలనుకుంటే ఇదే మంచి సమయం. ఇప్పటి నుంచే మీరు కొన్ని కొత్త గమ్యస్థానాలను ఫిక్స్ చేసుకోండి. మీకు ప్రయాణం చేయడం ఇష్టముంటే.. 2023 సంవత్సరంలో మీరు ఎక్కువ సమయం ట్రావెల్ చేయాలని చూస్తున్నట్లయితే.. మీకోసం ఇక్కడో లిస్ట్ ఉంది. ఇది మీకు అన్ని ప్రయాణ ప్రేరణతో పాటు.. ప్రయాణ ప్రణాళికని అందిస్తుంది.
పర్వతాలు, బీచ్‌ల నుంచి ఎడారులు, మైదానాల వరకు.. భారతదేశంలోని ఐదు అందమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీరు మీ 2023 ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలి.
కాశ్మీర్
"భూమిపై స్వర్గం ఉంటే.. అది ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ మాత్రమే ఉంది. ఇది ఇక్కడే ఉంది!" అంటూ అమీర్ ఖుస్రో కాశ్మీర్‌ను గురించి వివరించారు. దీనిగురించి మరింత నిజాయితీగా చెప్పాలంటే.. ఈ అద్భుతమైన గమ్యస్థానంలో ఎవరైనా సులభంగా ప్రేమలో పడిపోతారు. కాబట్టి మీరు ఎటువంటి తిరస్కరణ లేకుండా కాశ్మీర్ వెళ్లొచ్చు.
సహజమైన సరస్సులు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ల నుంచి ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్, మంచుతో కప్పిన శిఖరాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి.
వర్కల, కేరళ
బీచ్‌లు, బ్యాక్‌వాటర్‌లు, పర్వత శ్రేణులు, వన్యప్రాణుల అభయారణ్యాలతో కూడిన బహుళ ప్రదేశాలపై కేరళ చాలా ప్రేమ, శ్రద్ధను పొందుతుంది. ఏది ఏమైనప్పటికీ.. వెర్కల మీ అంచనాలు తారుమారు చేస్తుంది.
కప్పిల్ సరస్సు.. కొబ్బరి తోటలు.. వర్కాల బీచ్ మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంది. అదనంగా వర్కల టన్నెల్ బోటింగ్‌కు అనువైనది. అంజెంగో కోట చారిత్రాత్మకమైనది.
హంపి, కర్ణాటక
కర్నాటకలోని హంపి చరిత్ర ప్రియులకు ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే మీరు ఖచ్చితంగా ఏడాదికి మీ ప్రయాణ బకెట్ జాబితాలో దీన్ని చేర్చాలి. ఈ పురాతన గ్రామంలో.. మీరు కొన్ని శతాబ్దాల నాటి శిథిలాలను అన్వేషించవచ్చు.
డోంగిలో పడవ ప్రయాణంలో మునిగిపోవచ్చు. హిప్పీ ద్వీపంలో స్వేచ్ఛగా ఉండవచ్చు. మాతుంగా కొండ నుంచి సూర్యాస్తమయం ఇక్కడ మరొక అందమైన ఆకర్షణగా నిలుస్తుంది.
జైసల్మేర్
జైసల్మేర్, రాజస్థాన్‌లోని గోల్డెన్ సిటీ. అక్కడి ఇసుక దిబ్బలు, శక్తివంతమైన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోటలు, రాజభవనాలు, సరస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇది సందర్శించడానికి అందమైన గమ్యస్థానంగా చేస్తుంది.
ఇక్కడ ఉన్నప్పుడు.. జైసల్మేర్ కోట, పారాసైలింగ్ కోసం కనోయి, గడిసర్ సరస్సు, డూన్ బాషింగ్ కోసం థార్ ఎడారి, ఎడారి నేషనల్ పార్క్, ఇండో-పాక్ సరిహద్దులను చిరస్మరణీయమైన సమయం కోసం సందర్శించండి.
సిక్కిం
సిక్కిం విశాలమైన గమ్యస్థానం దాని అందమైన ప్రకృతి దృశ్యాల కోసం తప్పనిసరిగా సందర్శించదగినది. భూటాన్, నేపాల్, టిబెట్ మధ్య ల్యాండ్‌లాక్ చేసిన ఈ ప్రదేశం మీకు కచ్చితంగా మంచి అనుభూతులు ఇస్తుంది.
చాంగు సరస్సు వద్ద యాక్ రైడ్, గాంగ్టక్ వ్యాలీ వద్ద హెలికాప్టర్ రైడ్ పర్యాటకులకు ప్రసిద్ధి. అదనంగా మీరు గ్యాంగ్‌టక్‌లో గోచలా ట్రెక్, గొండోలా రైడ్, యుమ్‌తాంగ్‌లో హ్యాండ్ గ్లైడింగ్ కూడా చేయవచ్చు.