తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఎప్పుడూ తినడమే కాదు.. ఉపవాసం చేసినా భారీ బెనిఫిట్స్ పొందవచ్చట..

ఎప్పుడూ తినడమే కాదు.. ఉపవాసం చేసినా భారీ బెనిఫిట్స్ పొందవచ్చట..

20 January 2023, 8:00 IST

    • Health Benefits of Fasting : మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయానికి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో.. అదే విధంగా సమయానికి శరీర వేగాన్ని పాటించడం కూడా మనకు చాలా ముఖ్యం. అందుకే మన దేశంలో పురాతన కాలం నుంచి ఉపవాస ప్రక్రియను పాటిస్తున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు.
బేకింగ్ సాడా అయిపోయాక..
బేకింగ్ సాడా అయిపోయాక..

బేకింగ్ సాడా అయిపోయాక..

Health Benefits of Fasting : ఆయుర్వేదం ప్రకారం.. ఉపవాసం శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. కానీ ఆయుర్వేదం మాత్రమే కాదు.. చాలా మంది ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఉపవాసం వల్ల శరీరానికి కలిగే అనేక రకాల ప్రయోజనాలు గురించి ఇప్పటికే చాలాసార్లు ప్రస్తావించారు. ఉపవాసం పాటించే అనేక పండుగలు, రోజులు ఎలాగో ఉంటూనే ఉంటాయి. అయితే ఆ సమయంలో మీరు కూడా ఉపవాసం పాటించి ఆరోగ్య ప్రయోజనాలు పొందేయండి. ఇంతకీ ఉపవాసం చేయడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Sunday Motivation: ప్రపంచాన్ని గెలిచిన విజేతల విజయ రహస్యాలు ఇవే, ఫాలో అయిపోండి

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

రక్తంలో చక్కెరను నియంత్రణ

ఫాస్టింగ్ రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు కూడా ఉపవాసం ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.

గుండెను ఆరోగ్యంగానికై..

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపవాసం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. సరైన సమయంలో ఉపవాసం చేస్తే.. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ రెండింటినీ నియంత్రణలో ఉంటాయి. ఇది కాకుండా ఇతర పరిశోధనలు కూడా జరిగాయి. ఇందులో ఉపవాసం కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

ఊబకాయాన్ని తగ్గించుకోవడానికై..

పెరుగుతున్న బరువును నియంత్రించడానికి ఉపవాసం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మీరు ఎంత ఎక్కువ ఉపవాసం ఉంటే.. మీ శరీర బరువు తగ్గుతుందని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ సరైన సమయంలో, సరైన మార్గంలో కొన్ని పాటించడం వల్ల పెరుగుతున్న శరీర బరువును నియంత్రించుకోవచ్చు.

మానసిక ఆరోగ్యానికై..

మీరు డిప్రెషన్, ఆందోళన లేదా ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఉపవాసం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సరైన మార్గంలో ఉపవాసం చేయడం వల్ల మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను సరిచేయడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరంలో కార్టిసాల్ స్థాయి కూడా మెరుగుపడుతుంది.

తదుపరి వ్యాసం