Cozy Bedroom Ideas | పక్కలో ఆందోళన వద్దు.. పడకలో సుఖం లేకపోతే కష్టమే!
Cozy Bedroom Ideas: నిద్ర సరిగ్గా పట్టాలంటే మీరు పడుకునే పరుపు, మంచం మంచివై ఉండాలి. ఈ టిప్స్ పాటించండి.
మంచి నిద్రను ప్రోత్సహించడంలో కీలకమైన అంశం మన పడక గది, అలాగే మనం పడుకునే మంచం, ఆ మంచంపై ఉపయోగించే పరుపు. మనం నిద్రించడానికి ఉపయోగించే పరుపు ద్వారా మన నిద్ర చక్రం తయారవుతుంది. రోజంతా కష్టపడి పని చేసి, అలిసిపోయి మంచం మీద పడుకోగానే నిద్ర రావాలి. ఒకవేళ ఆ మంచంపై నిద్రపోవడంలో ఇబ్బందులు ఎదురైతే మరుసటి రోజు చిరాకు, అలసటగా అనిపించవచ్చు. చాలా మందికి ఒత్తిడి, ఆందోళనకు అత్యంత ముఖ్యమైన కారణాలలో నిద్ర లేకపోవడం కూడా ఒకటి. ఇది చివరికి మానసిక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే పడుకునే పక్క బాగుంటే ఆందోళనను దూరం చేసుకోవచ్చు.
మీ మంచం మీద వేసే పరుపును కూడా అత్యంత జాగ్రత్తగా ఎంచుకోవాలి. నాణ్యత లేని పరుపును ఉపయోగించడం వలన అలెర్జీ కారకాలు, దుమ్ము పురుగులు, ఇతర కీటకాలు అక్కడ వృద్ధి చెందుతాయి. లోపభూయిష్టమైన పరుపు ఎక్కువ వేడిని నిలుపుకుంటుంది, సౌకర్యవంతంగా ఉండదు. ఇవన్నీ మిమ్మల్ని ప్రశాంతమైన నిద్ర చక్రంలోకి రాకుండా చేస్తాయి. కాలం చెల్లిన పరుపుపై పడుకోవడం వల్ల వెన్నులో అసౌకర్యం, చికాకు వస్తుంది, ఇది మీ శరీరంలో ఆందోళను కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది.
మీరు తరచుగా గురక పెడుతున్నారు, కానీ మీ గురకకు కారణం తెలియడం లేదా? మీ గురకకు కారణమయ్యే వాటిలో మీ పరుపు కూడా ఒకటి. పరుపు సౌకర్యం లేకపోతే మీ శరీర భాగాలు ఒత్తిడిని ఎదుర్కొంటాయి, మీ వాయుమార్గాలలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఇది మీ గురకకు కారణమవుతుంది. మీ నిద్రించే పరుపు పాతదైతే అది గురకను పెంచవచ్చు. కాబట్టి మీ పరుపు, మంచం తీసుకునే విషయంలో దీర్ఘకాలికమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని మంచి పెట్టుబడి పెట్టండి. మీరు పడుకునే పడకలో సుఖం ఉంటేనే, జీవితంలో ప్రశాంతత ఉంటుందని గ్రహించండి.
Cozy Bedroom Ideas
మంచి పడకను ఎంచుకోవడంలో నిపుణులు కొన్ని చిట్కాలు అందించారు, అవి ఇక్కడ తెలుసుకోండి.
స్టోర్‌కు వెళ్లి చూడండి
ఇప్పుడు చాలా మంది దేన్నయినా ఆన్‌లైన్‌లో చూసి ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. కానీ మనం ఆన్‌లైన్‌లో చూసిన వస్తువు, మనం స్వీకరించిన వస్తువు భిన్నంగా ఉండవచ్చు. అందుకే మంచం, పరుపు కొనుగోలు చేసేటపుడు నేరుగా స్టోర్ కు వెళ్లి కొనుగోలు చేయడం మంచిది.
పరీక్షించి చూడండి
మీరు బెడ్ మీద పడుకొని చూడండి. సౌకర్యవంతంగా ఉందో లేదో పరీక్షించండి. మీ గదికి తగిన పరిమాణం అవునో కాదో కొలిచి చూడండి. మీ బెడ్ చుట్టూ కూడా మీరు నడిచేందుకు కొంచెం ఖాళీ స్థలం ఉండేలా బెడ్ కొనుగోలు చేయాలి.
సింగిల్ బెడ్‌కు మించి చూడండి
మీ ఒక్కరి కోసమే బెడ్ కొనుగోలు చేయాల్సి వచ్చిన సన్నని సింగిల్ సైజ్ కోసం చూడకండి. సుఖంగా నిద్రపోవాలంటే ఎక్కువ స్థలం కావాలి, కాబట్టి డబుల్ బెడ్‌లో పెట్టుబడి పెట్టడాన్ని పరిగణించండి.
సర్దుబాటు చేయగల బెడ్
స్ప్రింగ్, స్లాట్ బెడ్‌లు బ్యాక్ సపోర్ట్ కోసం ఉత్తమమైనవి అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఆదర్శవంతమైన మంచం పడుకునే వ్యక్తి పరిమాణం, ఆకారం, నిర్దిష్ట అవసరాలను తగినట్లుగా ఉండాలి. ఉదాహరణకు, మీరు పడుకున్నప్పుడు మీ వీపు తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, సర్దుబాటు చేయగల బెడ్‌ని ఎంచుకోవడం ఉత్తమం.
మీడియం స్థిరత్వం కలిగిన పరుపులు
మధ్యస్థంగా-ధృఢమైన పరుపులు తరచుగా 5 నుంచి 7 మధ్య స్థిరత్వం స్కేల్‌ను కలిగి ఉండే పరుపులను ఎంచుకోండి. ఈ రకమైన పరుపులు అందరికీ సౌకర్యాన్ని అందిస్తాయి.
సంబంధిత కథనం