నవరాత్రి ఉపవాసంలో నెయ్యితో టమోటా-బంగాళాదుంప స్పైసీ కర్రీ.. ఇలా ట్రై చేయండి!-how to make vrat wale aloo tamatar sabji in ghee navratri vrat sabzi recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నవరాత్రి ఉపవాసంలో నెయ్యితో టమోటా-బంగాళాదుంప స్పైసీ కర్రీ.. ఇలా ట్రై చేయండి!

నవరాత్రి ఉపవాసంలో నెయ్యితో టమోటా-బంగాళాదుంప స్పైసీ కర్రీ.. ఇలా ట్రై చేయండి!

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 07:14 PM IST

Navratri Vrat Sabzi Recipe: నవరాత్రి ఉపవాస సమయంలో బంగాళదుంపలతో చేసిన కర్రీలను ఎక్కువగా తింటారు. నెయ్యి వేసి టొమాటో, బంగాళాదుంపలను తయారుచేసే రెసిపీని ఎప్పుడైన ట్రై చేశారా?

Navratri Vrat Sabzi Recipe
Navratri Vrat Sabzi Recipe

నవరాత్రులు పవిత్రమైన రోజులు. నవరాత్రులలో ప్రతి రోజు దుర్గామాతను ఎంతో నిష్టతో ఆరాధిస్తారు. ఉపవాసంతో ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు నవరాత్రులలో ఆరవ రోజు. నిష్టతో ఓపిగ్గా శక్తి స్వరూపిణీకి పూజలు చేయాలంటే ఒంట్లో శక్తి చాలా అవసరం. అందుకే భోజనం తీసుకునే సమయంలో బలమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఉపవాస సమయంలో బంగాళదుంప , కూరగాయలతో భోజనం ఎక్కువగా చేస్తుంటారు. కూరగాయలతో చేసే వంటలు రుచితో పాటు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఉపవాస సమయంలో నెయ్యితో బంగాళదుంప-టమోటాతో చేసిన స్పెషల్ వంటకాన్ని ఎప్పుడైన ప్రయత్నించారా? ఈ వంటకం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?. మరి ఆ రెసీపిని ఎలా తయారుచేసుకోవాలో ఓ సారి చూద్దాం.

బంగాళదుంప టొమాటో కోసం కావలసినవి

- బంగాళదుంప

- టొమాటో

- పచ్చిమిర్చి

- అల్లం

- జీలకర్ర

- రాక్ సాల్ట్

- నల్ల మిరియాల పొడి

- రెడ్ చిల్లీ పౌడర్ (ఐచ్ఛికం)

- పెరుగు

- పచ్చి కొత్తిమీర

- నెయ్యి

ఎలా తయారు చేసుకోవాలి

దీన్ని చేయడానికి, ముందుగా బంగాళాదుంపలను బాగా కడగాలి. తర్వాత వాటిని ఉడకబెట్టండి.

- టమోటాలు, పచ్చిమిర్చి, పచ్చికొత్తిమీరలను బాగా కడిగి తరగాలి.

ఇప్పుడు అల్లం ముక్కలను కడిగి తొక్క తీసి తురుముకోవాలి.

బంగాళాదుంపలు ఉడకబెట్టిన తర్వాత, చల్లబరచండి తర్వాత పై తొక్క తీయండి

బంగాళాదుంపలను కత్తితో కట్ చేయండి.

ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి.

వేడి అయ్యాక జీలకర్ర వేసి, పచ్చిమిర్చి, అల్లం వేయాలి.

కనీసం 30 సెకన్ల పాటు వేయించాలి.

తర్వాత అందులో టొమాటోలు వేసి కొద్దిగా నీళ్లతో మూత పెట్టాలి.

2 నుండి 3 నిమిషాల తర్వాత చెక్ చేయండి.టొమాటోలు ఉడికయే లేదో చూడండి.

ఇప్పుడు దానికి రాక్ సాల్ట్, మిరియాల పొడి, ఎర్ర మిరప పొడి జోడించండి.

సుగంధ ద్రవ్యాలు బాగా ఉడికించి బంగాళాదుంపలను జోడించండి.

ఇప్పుడు అందులో అవసరమైనంత నీరు కలపండి. ఇది ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత సర్వ్ చేయాలి.

WhatsApp channel

సంబంధిత కథనం