తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Intermittent Fasting Health Benefits : మీరు ఈ డైట్ చేస్తే.. 3 ప్రయోజనాలు కచ్చితంగా పొందుతారు

Intermittent Fasting Health Benefits : మీరు ఈ డైట్ చేస్తే.. 3 ప్రయోజనాలు కచ్చితంగా పొందుతారు

01 October 2022, 10:10 IST

google News
    • Intermittent Fasting Health Benefits : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేప్పుడు.. ముఖ్యంగా మూడు ప్రయోజనాలు ఉంటాయి. దాని గురించి పూర్తిగా తెలుసుకుని ప్రారంభిస్తే.. మీరు మంచి ఫలితాలు పొందగలరు అంటున్నారు ఆరోగ్య, ఆహార నిపుణులు.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్

Intermittent Fasting : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మీరు తినడానికి ఒక నిర్థిష్టమైన సమయాన్ని ఎంచుకోవడం. మిగిలిన సమయంలో మీరుకచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఇప్పుడిప్పుడే ప్రజల్లో దీనిపట్ల ఆసక్తి పెరుగుతుంది. అయితే చాలా మంది ఫాలో అయ్యేది ఏంటంటే 16 - 8 విండో. 16 గంటలు ఉపవాసం ఉంటే.. 8 గంటల్లో మీరు ఆహారం తీసుకోవచ్చు. దీనివల్ల శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి.. మన శరీరంలోని కొవ్వును కోల్పోయేలా చేస్తాయి. అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు

* ఇది ఇన్సులిన్ స్థాయిని తగ్గిస్తుంది. మీరు దాదాపు 16 గంటల పాటు ఉపవాసం ఉన్నప్పుడు.. మీ శరీరంలో ఏమీ ఉండదు. కాబట్టి మీ శరీరం శక్తి కోసం మీ కొవ్వు కణాలను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ విధంగా మీరు మీ కొవ్వును తగ్గించుకోగలరు.

* ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీ మానవ పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్‌ను 5 రెట్లు పెంచుతుందని అంటారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

* అన్నింటికంటే ముఖ్యమైనది మీ జీవక్రియను ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పెంచుతుంది. మీరు అధిక జీవక్రియను కలిగి ఉంటారు. ఆ సమయంలో మీ కొవ్వును తగ్గించే ప్రక్రియ వేగంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు.. మీ శరీరం సెల్యులార్ మరమ్మత్తు ప్రక్రియలను పెంచుతుంది. ఉదాహరణకు కణాల నుంచి వ్యర్థాలను తొలగిస్తుంది.

తదుపరి వ్యాసం