తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Top Foreign Destinations : పిక్చర్ - పర్పెక్ట్ విదేశి డెస్టినేషన్లు ఇవే..

Top Foreign Destinations : పిక్చర్ - పర్పెక్ట్ విదేశి డెస్టినేషన్లు ఇవే..

04 January 2023, 14:51 IST

google News
    • 2023 Travel Bucket List : సుదూర ప్రాంతాలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. మీరు కూడా వారిలో ఒకరు కావొచ్చు. అయితే మీరు పలు విదేశాలకు కూడా వెళ్లొచ్చు. మీ కోరికలు, ఇష్టాలను బట్టి.. పలు గమ్యస్థానాలు ఎంచుకోవచ్చు. అయితే ఈ సంవత్సరంలో మీరు పిక్చర్ - పర్పెక్ట్ గమ్యస్థానాలకు వెళ్లాలనుకుంటే ఇక్కడో లిస్ట్ ఉంది. 
ప్రయాణ బకెట్ జాబితా
ప్రయాణ బకెట్ జాబితా

ప్రయాణ బకెట్ జాబితా

Top Foreign Destinations : కొత్త సంవత్సరంలో మీరు ఏదైనా కొత్త ప్రదేశాలకు వెళ్లాలి అనుకుంటే.. మీ ట్రావెల్ లిస్ట్​లో స్వదేశాలతో పాటు.. విదేశాలకు కూడా ప్లాన్ చేసుకోండి. అయితే మీరు ట్రిప్, సుదీర్ఘ వారాంతాలను ఆస్వాదించడానికి ఇక్కడ ఓ లిస్ట్ ఉంది.

దీనిలో ప్రపంచంలోని కొన్ని సుందరమైన గమ్యస్థానాలను సందర్శించడానికి, అన్వేషించడానికి మీకు కొంత అవగాహన కలిగిస్తుంది. మీ 2023 ట్రావెల్ బకెట్ లిస్ట్‌లో మీరు చేర్చుకోగల ఐదు విదేశీ స్థలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టర్కీ

టర్కీలోని కప్పడోసియా గురించి అత్యంత ఆకర్షణీయమైన విషయాలలో ఒకటి ఆకాశాన్ని అలంకరించే దాని హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు. అదనంగా ఇక్కడ గుహ హోటళ్లు, అద్భుత చిమ్నీలు, భూగర్భ పురాతన నగరాలను కలిగి ఉంది. ఇవి టర్కీ మొత్తం అందాన్ని పెంచుతాయి.

మీరు ఈ అద్భుతమైన గమ్యస్థానాన్ని సందర్శించడానికి మరొక కారణం అక్కడి స్థానిక వంటకాలు, వైన్ సంస్కృతి. ఇది మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది.

నేపాల్

పొరుగు దేశమైన నేపాల్ మీరు బుక్‌మార్క్ చేయాల్సిన మరొక గమ్యస్థానం. ఖాట్మండు దాని రాజధాని నగరం. మౌంట్ ఎవరెస్ట్, 13 ఇతర శిఖరాలను చూసేందుకు మీరు ఎక్కే 'మౌంటైన్ ఫ్లైట్'ని అందిస్తుంది.

అదనంగా ఇది బహుళ దేవాలయాలకు నిలయం. ఇక్కడ మీరు స్థానిక సంప్రదాయాల గురించి తెలుసుకోవచ్చు. పోఖారా మరొక అందమైన నగరం. ఇది అనేక థ్రిల్లింగ్ ట్రెక్‌లకు ప్రారంభ స్థానం.

ఐస్లాండ్

ప్రపంచంలోని అత్యంత శాంతియుత దేశంగా పేరుగాంచిన ఐస్‌లాండ్‌లో మీరు నార్తర్న్ లైట్స్ లేదా అరోరా బొరియాలిస్ వంటి అందమైన దృష్యాలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.

ఇక్కడ మీరు తిమింగలం చూసే పర్యటనకు కూడా వెళ్లవచ్చు. మంచుతో కప్పి ఉన్న పర్వతాల మధ్య మీరు గుర్రంపై రైడ్ చేయవచ్చు. కొన్ని సహజమైన వేడి కొలనులలో మీరు స్నానం చేయవచ్చు. స్నార్కెలింగ్ లేదా స్నోమొబైలింగ్‌లో మునిగిపోవచ్చు. ఐస్ కేవింగ్, గ్లేసియర్ హైకింగ్ కూడా ప్రసిద్ధ కార్యకలాపాలు.

దక్షిణాఫ్రికా

స్కైడైవింగ్, కేబుల్ కారులో దూకడం నుంచి పారాగ్లైడింగ్, జంగిల్ సఫారీ వరకు.. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ ఒక సాహస విచిత్ర స్వర్గం. సాహసోపేతమైన, ఫ్యూజన్ వంటకాలతో నిండిన ఈ తీర నగరం వివిధ సంస్కృతుల ద్రవీభవన స్థానం.

ఇది టేబుల్ మౌంటైన్‌కు నిలయం. ఇక్కడ మీరు ఏకాంతంగా కూర్చుని చుట్టూ చూడగలరు. మీరు కొన్ని ఆఫ్రికన్ పెంగ్విన్‌లను గుర్తించగల బౌల్డర్స్ బీచ్ కూడా ఇక్కడుంది.

హవాయి

అద్భుతమైన బీచ్‌లు, ఆకట్టుకునే సముద్ర జీవులు, ప్రపంచ స్థాయి సర్ఫింగ్, సాహసోపేతమైన హైక్‌లు, హవాయి చాలా ఆహ్లాదకరమైన, సుందరమైన గమ్యస్థానంగా ఉంది.

ఇక్కడ ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి. వీటిలో అగ్నిపర్వతాలు ఉన్నందున ఓహు అత్యంత ప్రసిద్ధమైనదిగా చెప్తారు. స్థానిక వంటకాలు.. తాజావి, ఫార్మ్-టు-టేబుల్.. ఇది మీకు మొత్తం విశ్రాంతిని ఇస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం