Toli Ekadashi 2023 | తొలి ఏకాదశి శుభాకాంక్షలు.. భక్తిభావాన్ని పెంపొందించే విష్ణు మంత్రాలు ఇవిగో!
28 June 2023, 15:59 IST
- Toli Ekadashi 2023: పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీ కుటుంబ సభ్యులు, బంధువులకు తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి. ఏకాదశి నాడు భక్తిభావాన్ని పెంపొందించే విష్ణుమంత్రాలు, పండగ శుభాకాంక్షలు, సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం.
deva shayana toli ekadashhi
Toli Ekadashi 2023: ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూన్ 29న తొలి ఏకాదశి పండగ జరుపుకోనున్నారు. సనాతన ధర్మంలో ఆషాఢ శుద్ధ ఏకాదశికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజు నుంచి శ్రీ మహవిష్ణువు క్షీర సాగరం యందు శయనిస్తాడు. కనుక దీన్ని 'దేవశయన ఏకాదశి' అని కూడా పిలుస్తారు. ఇలా, తొలి ఏకాదశి రోజు నిద్రపోయే స్వామి వారు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు నిద్రలోంచి మేల్కొంటారు. అయితే స్వామి వారు యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసంగా పేర్కొంటారు. చాతుర్మాసాల్లో సాధారణంగా ఎలాంటి శుభ కార్యాలు జరగవు.
తొలి ఏకాదశి నాడు లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువును పూజించటం, శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక పూజలు చేయడం, నోములు నోయడం ద్వారా ఆ నారాయణుడి కృపాకటాక్షలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఈరోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం శుభకరంగా పేర్కొంటారు.
తొలి ఏకాదశి ప్రకృతిలో మార్పులను కూడా తీసుకువస్తుంది. ఈరోజు నుంచే సూర్యుడు దక్షణం వైపుకు మరలుతాడు, అందుకే ఇది దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. విష్ణువు యోగ నిద్ర కారణంగా ఈరోజు నుంచి భూమిపై రాత్రి సమయం పెరుగుతుంది, పగలు సమయం తగ్గుతుందని చెబుతారు.
ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి రోజున మీ కుటుంబ సభ్యులు, బంధువులకు తొలిఏకాదశి శుభాకాంక్షలు తెలియజేయండి. ఏకాదశి నాడు భక్తిభావాన్ని పెంపొందించే విష్ణుమంత్రాలు, పండగ శుభాకాంక్షలు, సందేశాలను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని మీ ఆత్మీయులతో పంచుకుంటూ పండగ సంబరాన్ని పెంచండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమ:
విఠల విఠల విఠల హరి ఓం విఠల..
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు: ౹
హిరణ్యగర్భ: శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ: ౹
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి..
తన్నోవిష్ణుః ప్రచోదయాత్|
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
విస్తార స్థావర స్థాణు: ప్రమాణం బీజమవ్యయం ౹
అర్థో నర్థో మహాకోశో మహాభోగో మహాధన: ౹౹
తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
ఈ పవిత్ర దినమున ఆ శ్రీ మహా విష్ణువు మీ ప్రార్థనలను ఆలకించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు!
మీ తప్పులను మన్నించి ఆ శ్రీ మహావిష్ణువు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశిస్తూ.. తొలి ఏకాదశి శుభాకాంక్షలు!