తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Almond Rose Kheer Recipe : ఆల్మండ్ రోజ్ ఖీర్.. ఈ రోజు ట్రై చేయండి.. పండగకి వండేయండి..

Almond Rose Kheer Recipe : ఆల్మండ్ రోజ్ ఖీర్.. ఈ రోజు ట్రై చేయండి.. పండగకి వండేయండి..

15 October 2022, 7:25 IST

    • Almond Rose Kheer Recipe : దీపావళి దగ్గర్లో ఉంది. ఆ సమయంలో మంచి మంచి వంటకాలు చేసుకోవాలని అనుకుంటాము. దాని కోసం ముందే ఒకసారి ట్రైల్ వేశామనుకోండి.. బాగా వస్తే పండుగకి కూడా చేసేయొచ్చు. ఇంటిల్లిపాది ఆస్వాదించేయవచ్చు. పైగా ఇది స్వీట్ కాబట్టి ఏ పండుగకైనా.. శుభకార్యానికైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంతకీ ఆ స్వీట్ ఏంటి అనుకుంటున్నారా.. అదే ఆల్మండ్ రోజ్ ఖీర్.
ఆల్మండ్ రోజ్ ఖీర్
ఆల్మండ్ రోజ్ ఖీర్

ఆల్మండ్ రోజ్ ఖీర్

Almond Rose Kheer Recipe : పండుగ సీజన్​లో ఇంటిల్లీపాది హాయిగా ఆస్వాదించడానికి ఖీర్​ ఓ రుచికరమైన వంటకం అని చెప్పవచ్చు. పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ దీనికి ఫ్యాన్సే. పైగా ఉదయం పూజ చేసిన తర్వాత.. చాలా మంది వీటినే బ్రేక్​ఫాస్ట్​లాగా సేవిస్తారు. అలాంటి స్వీట్​ రెసిపీనే ఆల్మండ్ రోజ్ ఖీర్. పైగా దీనిని సులభంగా చేసేయవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Bed Time Habit : మీకు రాత్రిపూట ఈ అలవాటు ఉంటే.. అది బంధానికి విలన్

Capsicum Pachadi: స్పైసీగా క్యాప్సికం పచ్చడి ఇలా చేసుకోండి, చూడగానే నోరూరిపోతుంది

Peepal Tree Leaves Benefits : రావి చెట్టు ఆకుల ప్రయోజనాలు మీకు నిజంగా తెలియవు

కావాల్సిన పదార్థాలు

* పాలు - 2 లీటర్లు

* బియ్యం - 120 గ్రాములు

* పంచదార - 40 గ్రాములు

* రోజ్ వాటర్ - 3-4 డ్రాప్స్

* ఎండిన గులాబీ రేకులు - 10 గ్రాములు

* బాదం - 100 గ్రాములు

* బాదం ముక్కలు - 25 గ్రాములు

బాదం రోజ్ ఖీర్ తయారీ విధానం

బియ్యాన్ని నీటిలో సుమారు 20 నిమిషాలు నానబెట్టాలి. లోతు ఎక్కువగా ఉన్న పాన్ తీసుకుని.. దానిలో పాలు వేసి వేడి చేయాలి. అవి బాగా మరిగిన తర్వాత.. మంటను తగ్గించి.. పాలు సగం అయ్యేవరకు మరిగించాలి. పాలు సగమయ్యాక.. దానిలో నానబెట్టిన బియ్యం వేసి.. మెత్తగా ఉడికే వరకు.. మిశ్రమం చిక్కగా అయ్యే వరుకు కలుపుతూ ఉండాలి. పంచదార వేసి.. అది కరిగే వరకు బాగా తిప్పి.. స్టౌవ్ ఆపేయాలి.

చల్లారిన తర్వాత రోజ్ వాటర్ వేసి కలపాలి. సర్వ్ చేసుకునేవరకు ఫ్రిజ్‌లో పెట్టుకోండి. ఈలోపు ఓవెన్‌లో బాదంను 180 డిగ్రీల వరకు 5 నిమిషాల పాటు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు ఉంచండి.

చల్లారిన తర్వాత రోజ్ వాటర్ వేసి కలపాలి. సర్వ్ చేసే వరకు ఫ్రిజ్‌లో ఉంచండి.6.కొన్ని బాదం ముక్కలను ఓవెన్‌లో 180డిగ్రీల వరకు 5 నిమిషాల పాటు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు కాల్చండి. తినేటప్పుడ బాదం పలుకులను, బాదంలతో, ఎండిన గులాబిరేకులతో గార్నిష్ చేసుకుని హ్యాపీగా లాగించేయండి.

తదుపరి వ్యాసం