తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Vada Recipe : క్రంచీగా, టేస్టీగా పాలకూర వడలు చేసేయండి.. హ్యాపీగా లాగించేయండి

Palak Vada recipe : క్రంచీగా, టేస్టీగా పాలకూర వడలు చేసేయండి.. హ్యాపీగా లాగించేయండి

14 October 2022, 6:50 IST

    • Palak Vada recipe : ఒక్కోసారి మనసు టేస్ట్​ని కోరుకుంటుంది. అలాంటప్పుడు డైట్​ని పక్కన పెట్టి.. ఏదైనా తినేయాలి అనిపిస్తుంది. అయితే టేస్ట్​తో పాటు.. ఆరోగ్యానికి మంచి చేసే ఫుడ్​ని తీసుకోవడం ఈ సమయంలో మంచి ఎంపిక. కాబట్టి పాలకూర వడలు ట్రై చేయండి.
పాలకూర వడ
పాలకూర వడ

పాలకూర వడ

Palak Vada recipe : ఉదయాన్నే క్రంచీగా, టేస్టీగా, హెల్తీగా ఉండే బ్రేక్​ఫాస్ట్ తినాలనుకునేవారికి పాలకూర వడలు బెస్ట్ ఆప్షన్. ఇది డీప్​ ఫ్రై చేస్తాము అని భాదపడినా.. దానిలోని పాలకూర మనకు కచ్చితంగా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. పైగా దీని రుచి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మరి ఈ పాలకూర వడలు ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Brinjal in Pregnancy: గర్భిణులు వంకాయలు తినకూడదని ఆయుర్వేదం ఎందుకు చెబుతోంది?

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

కావాల్సిన పదార్థాలు

* పచ్చి శనగపప్పు - ఒకటిన్నర కప్పు (నానబెట్టినవి)

* పాలకూర - 1 కప్పు (కడిగి తరిగి పెట్టుకోవాలి)

* పచ్చిమిర్చి - 2-3

* అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్

* కారం - 1 టీస్పూన్

* సాల్ట్ - తగినంత

పాలకూర వడలు తయారు చేసే విధానం

ముందుగా నానబెట్టిన శనగ పప్పును మిక్సీలో వేసి మంచిగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేయాలి. దీనిలో పాలకూర, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతె పొడి, సాల్ట్, కారం వేసి బాగా కలపండి. దీనిలో కొద్దిగా నీరు (అవసరమైతే) వేసి కలపండి.

స్టౌవ్ వెలిగించి.. డీప్ ఫ్రై కోసం కడాయిలో నూనె వేయాలి. అది వేడిగా అయ్యాక.. పిండిని తీసుకుని చిన్న భాగాన్ని వడ లెక్క ఒత్తుకుని.. దానిని నూనెలో వేయాలి. వాటిని డీప్ ఫ్రై చేయండి. అంతే వేడి వేడి పాలకూర వడలు రెడీ. ఉదయాన్నే ఈ క్రంచీ వడలను కెచప్, పుదీనా లేదా చింతపండు చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోద్ది. లేదంటే.. మంచి అల్లం టీ పెట్టుకుని.. దానికి తోడుగా తీసుకున్నా.. మీ కడుపు ఫుల్ అయిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం