తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Healthy Food: ఆ మూడింటిని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యమని చెబుతున్న వైద్యులు, వారి మార్గదర్శకాలు ఇదిగో

Haritha Chappa HT Telugu

10 May 2024, 20:00 IST

    • Healthy Food: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వైద్యులు భారతీయ ప్రజల కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని అందరూ పాటించాల్సిన అవసరం ఉంది.
జీవిత కాలం పెంచుకోవాలంటే ఏం తినకూడదు?
జీవిత కాలం పెంచుకోవాలంటే ఏం తినకూడదు? (Pixabay)

జీవిత కాలం పెంచుకోవాలంటే ఏం తినకూడదు?

Healthy Food: దేశంలోని ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ, అంటు వ్యాధులు, అనారోగ్యాల నుంచి దూరంగా ఉండేందుకు ICMR వైద్యులు మార్గదర్శకాలను విడుదల చేశారు. వారు చెబుతున్న ప్రకారం మన దేశంలో వ్యాధుల బారిన పడుతున్న వారిలో 56 శాతం మంది అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగానే ఆ వ్యాధులను తెచ్చుకుంటున్నట్టు నిర్ధారించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా అకాల మరణాలను బారిన పడకుండా కాపాడుకోవచ్చని వారు చెబుతున్నారు వైద్యులు.

ICMR వైద్యులు విడుదల చేసిన నివేదికలో 148 పేజీలు ఉన్నాయి. వాటిలో మనం తినే ఆహారాల గురించి, తినకూడని ఆహారాల గురించి వివరంగా పొందుపరిచారు. వంటనూనెల వినియోగం, సముద్రపు ఆహారం, కొవ్వు ఆహారం.. వీటన్నింటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యప్రయోజనాలేమిటో తెలుసుకోండి.

అధిక బరువు ఎన్నో ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని, చక్కెరను నిండిన, కొవ్వు కలిగిన పదార్థాలను తినడం, అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలను అధికంగా తినడం వల్ల శరీరం బరువు పెరుగుతున్నట్టు వివరించారు. అలాగే శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి కారణంగా వివరించారు.

వీటిని తినవద్దు

ICMR వైద్యులు చెబుతున్న ప్రకారం ఉప్పు, పంచదార, ప్రోటీన్ సప్లిమెంట్లను ఎంత తగ్గిస్తే అంత ఎక్కువ కాలం జీవించవచ్చు. అలాగే నూనెలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రోజుకు 20 నుంచి 25 గ్రాముల చక్కెరకు మించి తినకూడదని చెబుతున్నారు వైద్యులు. కార్బోహైడ్రేట్ల నుంచి కూడా సహజంగా చక్కెర శరీరంలో చేరుతుందని, ఇక బయట నుంచి కూడా చక్కెరను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు వారు వివరించారు.

ఎంతోమంది యువత కండలను పెంచుకోవడం కోసం ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకుంటూ ఉంటారు. ఇలా ప్రోటీన్ పౌడర్లను, ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల ఎముకల్లో ఖనిజాలు నష్టపోవచ్చు. మూత్రపిండాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రోటీన్ సప్లిమెంట్లను, ప్రోటీన్ పౌడర్లను తినడం మానేయాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మంచిది. చక్కెర వినియోగించడం తగ్గించి, సమతుల ఆహారం తృణధాన్యాలు, చిరుధాన్యాలు తినడం పెంచుకోవాలి. అలాగే పప్పులు, బీన్స్ వంటివి కూడా తినాలి. కూరగాయలు, పండ్లు, పాలు ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. కొవ్వు ఉండే ఆహారాలను తగ్గించుకోవాలి. నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలి. ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఇవన్నీ పాటించడం వల్ల జీవన కాలాన్ని పెంచుకోవచ్చు. వ్యాధుల బారిన పడి అకాల మృత్యువుతో పోరాడాల్సిన అవసరం కూడా రాదు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్లు వంటి వాటికి దూరంగా ఉండవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం