Rice Kheer Recipe : రైస్ ఖీర్ చేయడం కష్టమనుకుంటున్నారా? ఇలా సింపుల్‌గా చేసేయండి
Rice Kheer Recipe : రైస్ ఖీర్ గురించి మనం వినే ఉంటాము. ఇది పాయసం వలె ఉంటుంది. అందుకే దీనిని చాలా మంది ఇష్టపడతారు. కానీ దీనిని ఎలా తయారు చేయాలో తెలియకు.. ఆ స్వీట్‌కి దూరంగా ఉంటున్నారా? అయితే ఈరోజు దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
Rice Kheer Recipe : పండుగల సమయంలో లేదా.. పుట్టిన రోజులలో రైస్ పాయసం అనేది చాలా ఎక్కువగా చేసుకుంటారు. అయితే రైస్ ఖీర్ కూడా అచ్చం అలాంటిదే. మీరు పూజ చేసుకోవాలి అనుకుంటున్నా.. లేదా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లాగా స్వీట్ తినాలి అనుకున్నా.. లేదా పుట్టిన రోజో, పెళ్లి రోజు సందర్భంగా చేయాలనుకున్నా ఈ ఖీర్ మీకు చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పాలు - 5 కప్పులు
* బియ్యం - పావు కప్పు (కడిగినవి)
* పంచదార - అర కప్పు
* ఎండు ద్రాక్షలు - 10 నుంచి 12
*పచ్చి ఏలకుల - 4
* బాదం పప్పులు - 10 నుంచి 12 (తరిగినవి)
తయారీ విధానం
బియ్యం, పాలను ఓ లోతైనా పాన్‌లో తీసుకుని.. చిన్న మంట మీద ఉడకబెట్టండి. అన్నం ఉడికి, పాలు చిక్కబడే వరకు కలపండి. పూర్తయ్యాక పంచదార, ఎండుద్రాక్ష, యాలకులు వేసి బాగా కలపండి. చక్కెర దానిలో కరిగిపోయే వరకు కలుపుతూనే ఉండండి. కలిసిందని ఫిక్స్ అయ్యాక.. దానిని సర్వింగ్ డిష్‌లోకి తీసుకుని.. బాదంపప్పులతో అలంకరించండి. దీనిని వేడిగా లేదా చల్లగా తిన్నా బాగానే ఉంటుంది.
అయితే మీరు దీనిలో పాలు ఉడుకుతున్నప్పుడు కుంకుమపవ్వు కూడా వేసుకోవచ్చు. దాని రుచిని మరింత మెరుగుపరచడానికి రోజ్ వాటర్‌ను వేసి కలపవచ్చు.
సంబంధిత కథనం