తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies : రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే.. రాగిదోశ బెస్ట్ ఛాయిస్..

Breakfast Dairies : రోజును ఆరోగ్యకరంగా ప్రారంభించాలంటే.. రాగిదోశ బెస్ట్ ఛాయిస్..

21 June 2022, 7:46 IST

google News
    • దోశ అనేది ఓ సౌకర్యవంతమైన ఆహారం. దీనిని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే గ్లూటన్ రహిత ఆహారాన్ని ఇష్టపడేవారు మాత్రం రాగి దోశను ప్రయత్నించవచ్చు. అంతేకాకుండా ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 
రాగిదోశ
రాగిదోశ

రాగిదోశ

Ragidosa Recipe : రాగి దోశ. దీనిలో మంచి ఫైబర్ ఉంటుంది. అంతే కాకుడా ఇది రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది. పైగా గ్లూటన్ రహితమైన ఆహారాన్ని ఇష్టపడేవారు కచ్చితంగా దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనిలో ఫైబర్, ఇనుము, కాల్షియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకునేవారు కచ్చితంగా మీరు దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు. దీనిని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియదా? అయితే దానికి కావాల్సిన పదార్థాలేమిటో.. తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

* రాగిపిండి - 2 కప్పులు

* బియ్యం పిండి - అరకప్పు

* పుల్లని పెరుగు - 1/2 కప్పు

* పచ్చిమిర్చి - 3,4

* కొత్తిమీర - సన్నగా తురిమినది

* ఉల్లిపాయలు - అరకప్పు

* ఉప్పు - తగినంత

* ఆవాలు - 1 స్పూన్

* జీలకర్ర - 1 స్పూన్

* కరివేపాకు - కొంచెం

*నూనె - తగినంత

తయారీ విధానం

రాగి పిండి, బియ్యంపిండి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా కలపాలి. ఈ పిండిని 2 గంటలు నాననివ్వాలి. మూత వేసి పక్కన పెట్టేయాలి. అనంతరం నూనెను వేడి చేసి.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. ఆవాలు చిటపటలాడినప్పుడు ఆ తాలింపును పిండిలో వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. 

స్టవ్ మీద దోశపాన్ పెట్టి.. వేడి అయ్యాక దోశను పోయాలి. ఒకవైపు ఉడికిన తర్వాత.. రెండో వైపు తిప్పాలి. అంచుల వెంట కొద్దిగా నూనె పోయాలి. అంతే సింపుల్ రెసిపీ రెడీ. వేడిగా ఉన్నప్పుడు మంచి చట్నీతో దీనిని లాగించేయవచ్చు. 

తదుపరి వ్యాసం