తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Dairies: పెసరపప్పుతో హాట్ పాన్​కేక్స్.. బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ రెసిపీ

Breakfast Dairies: పెసరపప్పుతో హాట్ పాన్​కేక్స్.. బ్రేక్​ఫాస్ట్​కి బెస్ట్ రెసిపీ

18 June 2022, 7:20 IST

google News
    • పెసరట్టు, పెసర పునుగులు ఇలా పెసర్లతో రకరకాల వంటలు చేస్తారు. పైగా పెసలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి.. చాలా మంది దీనిని తమ బ్రేక్​ఫాస్ట్​లో తీసుకుంటారు. అయితే రోటీన్ వంటలకు బాయ్ చెప్పి.. కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకునేవారు పెసరపప్పుతో చేసే హాట్​ పాన్​ కేక్స్ తయారుచేసుకోవచ్చు.
హాట్​ పాన్​ కేక్స్
హాట్​ పాన్​ కేక్స్

హాట్​ పాన్​ కేక్స్

Moongdal Hot Pancakes : ఫైబర్, ప్రొటీన్లకు పెసరపప్పు గొప్ప మూలం. మీ ఆహారంలో పోషకాలను లోడ్ చేయాలనుకుంటే ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. అయితే దీనిని మీకు నచ్చేలా.. బ్రేక్​ఫాస్ట్​లో తీసుకోవాలనుకుంటే.. పెసరపప్పుతో హాట్ పాన్​కేక్స్ తయారు చేసుకోవచ్చు. దానిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పెసర పప్పు - 200 గ్రాములు

* నీరు - తగినంత (నానబెట్టి గ్రెండ్ చేయడానికి)

* ఉప్పు - తగినంత

* మిర్చి - 4

* బేకింగ్ సోడా - 1/2 టీస్పూన్

* ఉల్లిపాయ - 1 (పెద్దది)

* టొమాటో - 1

* క్యాప్సికమ్ - 1

* కొత్తిమీర - 1 కట్ట (చిన్నది)

* నూనె - తగినంత

తయారీ విధానం

ముందుగా పెసరపప్పును 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత దానిని కడిగి.. అదనపు నీటిని తీసివేసి.. ఉప్పు, పచ్చిమిర్చి వేసి రుబ్బుకోవాలి. మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. అవసరమైతే నీరు పోయాలి. 

స్టౌవ్ వెలిగించి దోశపాన్‌ పెట్టి.. దానిలో నూనె వేసి వేడి చేయాలి. పెసర పిండిని దోశ పాన్ మీద కాస్త మందంగా వేయాలి. ఈ స్ప్రెడ్ పైభాగంలో బుడగలు కనిపించిన తర్వాత.. ఉల్లిపాయలు, టొమాటోలు, తరిగిన మిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, తాజా కొత్తిమీర వేయాలి. ఈ టాపింగ్‌లను బేస్‌పై సున్నితంగా నొక్కండి. 

ఈ హాట్ పాన్​కేక్​ మంచిగా ఉడకడానికి ఒక్కో వైపు 4 నిమిషాలు పడుతుంది. అనంతరం రెండో వైపు కూడా తిప్పి.. మీడియం మంట మీద ఉడికించాలి. అంతే రుచికరమైన, సూపర్ హెల్తీ పెసరపాన్​కేక్​ రెడీ.

టాపిక్

తదుపరి వ్యాసం