తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipes : ఇన్‌స్టంట్ ఓట్స్ దోశ.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండోయ్..

Breakfast Recipes : ఇన్‌స్టంట్ ఓట్స్ దోశ.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండోయ్..

15 June 2022, 7:10 IST

    • మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారా? అయితే మీరు కూడా ఆరోగ్యకరమైన అల్పాహార వంటకాల కోసం వెతుకుతూ ఉంటారు. అయితే మీరు ఈ ఇన్​స్టంట్ ఓట్స్ దోశను తప్పక ప్రయత్నించాలి. దీనికోసం ఎక్కువ కష్టపడిపోవాలేమో అని భయపడకండి. చాలా త్వరగా దీనిని తయారుచేసుకోవచ్చు.
ఓట్స్ దోశ
ఓట్స్ దోశ

ఓట్స్ దోశ

Instant Oats Dosa : చాలా మంది మంచి ఆరోగ్యం కోసం రోజూ ఓట్స్ తింటారు. పాలతో కలిపి ఉదయాన్నే తీసుకుంటారు. అయితే మీకు ఈ రోటీన్ ఓట్స్​కు బ్రేక్ చెప్పాలనిపిస్తే.. ఈ ఇన్​స్టంట్ ఓట్స్​ దోశను ప్రయత్నించండి. ఇది తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి మీకు సొంతవుతుంది. కాబట్టి మీరు కూడా దీనిని తయారు చేసుకుని మంచిగా లాగించేయండి. దీనిని ఎలాతయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Cucumber Lassi Benefits : దోసకాయ లస్సీ.. 5 నిమిషాల్లో రెడీ.. శరీరాన్ని చల్లబరుస్తుంది

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

Almond Skin Care Tips : బాదం పప్పును ఇలా వాడితే మీ చర్మం మెరిసిపోతుంది.. ట్రై చేయండి

కావాల్సిన పదార్థాలు

* ఓట్స్ - 1 కప్పు

* రవ్వ - 1 స్పూన్

* బియ్యం పిండి - అరటేబుల్ స్పూన్ (గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు)

* మెంతి గింజలు - అర టీ స్పూన్

* ఉప్పు - రుచికి తగినంత

* ఇంగువ - చిటికెడు

* మిరియాల పొడి - అర టీ స్పూన్

* కరివేపాకు - 7 నుంచి 8

* పచ్చిమిర్చి - 1 స్పూన్ (తరిగిన ముక్కలు)

* ఉల్లిపాయ - 1 చిన్నది

* నూనె - తగినంత

తయారీ విధానం

ముందుగా ఓట్స్​ను కొంచెం గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించాలి. వాటిని చల్లార్చనిచ్చి.. దానిలో కొన్ని మెంతులు వేసి పొడి చేయాలి. ఈ పొడిని ఒక గిన్నెలో తీసి.. దానిలో సూజీ, బియ్యప్పిండిని వేయాలి. బియ్యం పిండి లేకపోతే.. ఒక చెంచా గోధుమ పిండిని కూడా వేసి కలపవచ్చు. దానిలో ఉప్పు, మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా కలపాలి.

అవసరానికి అనుగుణంగా నీటిని కలిపి మంచి స్థిరమైన పిండిని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాలు అలానే పక్కన పెట్టేయండి. అనంతరం దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బాగా కలపాలి. ఇప్పుడు దోశ పాన్ వెలిగించి.. దానిపై పిండితో దోశల్లాగా వేసుకోవాలి. ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత మరో వైపు తిప్పండి. దీనిని చట్నీ లేదా సాంబార్‌తో సర్వ్ చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం