తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breakfast Recipe : ఆరెంజ్, అల్లం డిటాక్స్ డ్రింక్​తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Breakfast Recipe : ఆరెంజ్, అల్లం డిటాక్స్ డ్రింక్​తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

24 August 2022, 7:34 IST

    • Orange and Ginger Detox Drink : శరీరానికి కావాల్సిన ఆహారం ఇవ్వడం ఎంత ముఖ్యమో.. శరీరంలో పేరుకుపోయిన మళినాలను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం. లేదంటే హెల్త్​ కరాబ్​ అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడానికి కొన్నింటిని తీసుకోవడం హెల్త్​కి చాలా మంచిది. దానిలో ఒకటే ఆరెంజ్, అల్లం డిటాక్స్ డ్రింక్.
డిటాక్స్ డ్రింక్
డిటాక్స్ డ్రింక్

డిటాక్స్ డ్రింక్

Orange and Ginger Detox Drink : డిటాక్స్ డ్రింక్స్ అనేవి హెల్త్​ని కాపాడుతాయి. ఇవి శరీరంలోని మళినాలను బయటకు పంపి.. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. కాబట్టి డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. పైగా డిటాక్స్ డ్రింక్స్ వల్ల శరీరంలోని చెడు కొవ్వు తొలగిపోతుంది. అయితే మీరు డిటాక్స్ డ్రింక్​ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వాటిలో ఒకటి ఆరెంజ్, అల్లం డిటాక్స్ డ్రింక్. పైగా దీనిలో పసుపు కూడా వేస్తాం కాబట్టి.. వ్యాయామం తర్వాత వచ్చే బోన్స్ పెయిన్​ తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి జిమ్ చేసి వచ్చాక కూడా ఈ డ్రింక్ తాగవచ్చు. ఇవే కాదండోయ్ వీటితో చాలా ఉపయోగాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Evening Walk Benefits : వేసవిలో సాయంత్రంపూట నడవండి.. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

Drumstick Chicken Gravy: మునక్కాడలు చికెన్ గ్రేవీ ఇలా చేసి చూడండి, ఆంధ్ర స్టైల్‌లో అదిరిపోతుంది

Bapatla Beach Tour : బాపట్ల టూర్.. తెలంగాణ వాళ్లు బీచ్ చూడాలనుకుంటే.. ఈ ఆప్షన్ బెస్ట్

Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

కావాల్సిన పదార్థాలు

* క్యారెట్ - 1 పెద్దది

* నారింజ - 2

* పచ్చి పసుపు - అర అంగుళం.. లేదా పసుపు - అర స్పూన్

* అల్లం - అర అంగుళం

* నిమ్మకాయ - సగం

తయారీ విధానం

ఆరెంజ్ జ్యూస్ తీసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను కూడా విడిగా మిక్సీ చేసుకోవాలి. వీటిని బ్లెండర్‌లో వేసి.. పసుపు, అల్లం వేసి.. బాగా బ్లెండ్ చేయాలి. దానిలో సగం నిమ్మకాయను పిండాలి. ఇప్పుడు వడకట్టాలి. దీనిని పరగడుపునే తీసుకుంటే.. మీ శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకి వచ్చేస్తాయి. పైగా మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

టాపిక్