తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Today Breakfast | పోహాను వెరైటీగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి

Today Breakfast | పోహాను వెరైటీగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి

HT Telugu Desk HT Telugu

03 June 2022, 7:05 IST

    • చాలా మంది పోహాను అల్పాహారంగా తీసుకుంటారు. పోహాను క్రమం తప్పకుండా.. తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే రోజూ పోహా తీసుకునేవారు కొంచెం డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంటే.. మీ కోసం ఇక్కడో రెసిపీ సిద్ధంగా ఉంది. ఇంకేం ఆలస్యం మీరు పోహా లవర్​ అయితే.. వెంటనే దీనిని చదివేయండి.
కార్న్ పోహా
కార్న్ పోహా

కార్న్ పోహా

Corn Phoa Recipe | పోహా భారతదేశం అంతటా ప్రసిద్ధ అల్పాహారం. దీనిని క్రమం తప్పకుండా అల్పాహారంగా తీసుకునే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. చాలా నగరాల్లో ఇది సాధారణ వీధి ఆహారం. మీరు కూడా పోహాను తినడానికి ఇష్టపడే వారైతే.. దానిని కొత్తగా తయారు చేసుకోవాలనుకుంటే.. ఇక్కడో కొత్త రెసిపీ మీకోసం సిద్ధంగా ఉంది. అయితే మీరు కూడా ఈ బ్రేక్​ఫాస్ట్ రెసిపీని తయారు చేసుకుని.. ఆస్వాదించేయండి.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

కావాల్సిన పదార్థాలు

* పోహా - 2 కప్పులు

* మొక్కజొన్న - 1 కప్పు

* ఉల్లిపాయ - 1

* టమోటాలు - 2

* ఆవాలు - 1 tsp

* ఎర్ర మిరప పొడి - 1/2 tsp

* పసుపు - 1/4 tsp

* పచ్చిమిర్చి ముక్కలు - 2

* కొత్తిమీర ఆకులు - 2 టేబుల్ స్పూన్లు

* అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 tsp

* నిమ్మకాయ - 1

* కరివేపాకు - 10-15

* నూనె - 1 టేబుల్ స్పూన్

* ఉప్పు - రుచి ప్రకారం

తయారీ విధానం

మొక్కజొన్న పోహా చేయడానికి.. ముందుగా పోహను శుభ్రం చేసి.. నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. మొక్కజొన్న గింజలను ఓ పాత్రలో తీసుకుని నీరు వేసి మరిగించాలి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

పాన్​ తీసుకుని స్టవ్​ వెలిగించి.. 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఆవాలు వేయాలి. అవి చిమ్మిన తర్వాత.. కరివేపాకు వేయాలి. అనంతరం దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అనంతరం టొమాటోలు, కారం, పసుపు, ఉప్పు వేసి కలపాలి. టమోటాలు మెత్తగా అయ్యాక అందులో ఉడికించిన మొక్కజొన్నలు వేసి గరిటతో బాగా కలపాలి.

అనంతరం నానబెట్టిన పోహాను నీరు లేకుండా పిండి... బాణలిలో వేసి బాగా కలపాలి. 1-2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన మొక్కజొన్న పోహా రెడీ. నిమ్మరసం, తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

టాపిక్

తదుపరి వ్యాసం