తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips For Healthy Hair : జుట్టు సమస్యలను అరికట్టే అలోవెరా

Tips for Healthy Hair : జుట్టు సమస్యలను అరికట్టే అలోవెరా

08 September 2022, 13:49 IST

    • Healthy Hair with Aloe vera Gel : వర్షాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఇటీవల కాలంలో కాలుష్యం వల్ల చాలా మందికి జుట్టు రాలిపోతుంది. అయితే ఇంట్లోనే పెరిగే కలబందతో మీరు మీ జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలను మీరు ఫాలో అయిపోయి.. మీ జుట్టును కాపాడుకోండి.
అలోవెరా గుజ్జుతో హెయిర్ మాస్క్
అలోవెరా గుజ్జుతో హెయిర్ మాస్క్

అలోవెరా గుజ్జుతో హెయిర్ మాస్క్

Healthy Hair with Aloe vera Gel : కలబంద ప్రయోజనాలను ఇప్పుడిప్పుడే ప్రజలు ఎక్కువగా తెలుసుకుంటున్నారు. మెరిసే, ప్రకాశవంతమైన చర్మం కావాలనుకునేవాళ్లకు కలబంద మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అంతేకాకుండా జుట్టును బలోపేతం చేయడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు తేమను పెంచుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అయితే జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తమ ఫలితాల కోసం వేటితో కలిపి ఈ జెల్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చుద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

Fruits in Refrigerator: ఈ పండ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు, అయినా వాటిని పెట్టి తినేస్తున్నాం

Egg Kofta: ఎగ్ కోఫ్తా వండుకుంటే సాయంత్రం స్నాక్స్‌గా అదిరిపోతుంది, పిల్లలకు నచ్చడం ఖాయం

Periods: పీరియడ్స్ డేట్ కన్నా ముందే రావాలనుకుంటున్నారా ఈ ఇంటి చిట్కాలను పాటించండి

అలోవెరా జెల్​ను ఎలా తీయాలంటే..

* సజీవ కలబంద మొక్క నుంచి ఒక ఆకును కోయండి.

* ఆకును నిలువుగా రెండు భాగాలుగా కత్తిరించిన తర్వాత ఆ జెల్​ను స్పూన్ సహాయంతో తీసేయండి. ఇదే ప్యూర్ అలోవెరా జెల్.

జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలి?

కలబంద గుజ్జును నేరుగా తలకు ఉపయోగించవచ్చు. లేదా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే హెయిర్ మాస్క్‌లను తయారు చేయడానికి అనేక ఇతర పదార్థాలతో కలపవచ్చు.

1. ఆముదంతో కలబంద

సహజ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి, వాల్యూమ్‌ను పెంచడానికి.. కలబందను ఆముదంతో కలపండి. ఒక కప్పు అలోవెరా జెల్ తీసుకుని దానికి రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలపండి. తలకు సమానంగా పట్టించండి. మీ హెయిర్​ను కవర్ చేసి.. 2-3 గంటలపాటు అలాగే ఉంచండి. అనంతరం మీ జుట్టును తేలికపాటి షాంపూతో శుభ్రం చేయండి.

2. ఉల్లిపాయ రసంతో కలబంద

కలబంద, ఉల్లిపాయ రసం కలిపి హెయిర్​కు మాస్క్​గా వేస్తే.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఉల్లిపాయ రసం స్కాల్ప్‌ను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలకు అడ్డుపడే హెయిర్ ఫోలికల్స్‌ను క్లియర్ చేస్తుంది. అలాగే ఉల్లిపాయ రసంలో సల్ఫర్ గాఢత ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి ఊతం ఇస్తుంది. జుట్టు రాలడాన్ని మరింత అరికడుతుంది.

కలబంద, ఉల్లిపాయ రసం సమాన భాగాలుగా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు సమానంగా అప్లై చేసి 30-45 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూని ఉపయోగించి శుభ్రం చేసుకోండి. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేయవచ్చు.

3. గ్రీన్ టీతో కలబంద

జుట్టు పెరుగుదలకు గ్రీన్ టీ ఆరోగ్యకరమైనది. జుట్టు రాలడాన్ని నిరోధించే కాటెచిన్‌లు అధికంగా ఉంటాయి. గ్రీన్ టీ జుట్టు రాలడానికి కారణమయ్యే డైహైడ్రోటెస్టోస్టెరాన్‌ను తగ్గిస్తుంది. ఒక కప్పు కలబంద గుజ్జులో తాజాగా తయారుచేసిన గ్రీన్ టీ కలపండి. దానితో తలకు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ తలపై మృదువైన చేతులతో అప్లై చేయండి. 15-20 నిమిషాలు అప్లై చేసిన తర్వాత చల్లటి నీటితో దానిని శుభ్రం చేసుకోండి.

4. ఉసిరితో కలబంద

ఉసిరికాయ లేదా గూస్బెర్రీ జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. అకాలంగా వచ్చే బూడిదను నివారిస్తుంది. అలోవెరా జెల్‌తో ఉసిరి రసం లేదా పొడిని మిక్స్ చేసి మీ తలకు సమానంగా అప్లై చేయండి. ఇది ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఉండనివ్వండి. సాధారణ నీటితో తలను శుభ్రం చేసుకోండి. ఆరోగ్యకరమైన, భారీ జుట్టు కోసం ఈ రెమెడీని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం