తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloe Vera Jell : అందానికైనా.. ఆరోగ్యానికైనా.. కలబంద చాలు..

Aloe vera Jell : అందానికైనా.. ఆరోగ్యానికైనా.. కలబంద చాలు..

05 August 2022, 12:09 IST

google News
    • Aloe vera Jell Benefits : మనలో చాలా మంది అలోవెరా జెల్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రమాణం చేస్తారు. అయితే, ఈ అద్భుతమైన పదార్ధాన్ని అత్యంత ప్రభావవంతమైన మార్గంలో ఎలా ఉపయోగించాలో మీకు తెలియజేస్తాము. చర్మం, జుట్టు మరియు మొత్తం ఆరోగ్యానికి కలబంద ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకోండి
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు
కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు

కలబంద వల్ల కలిగే ప్రయోజనాలు

Aloe vera Jell Benefits : ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో మన మొత్తం శ్రేయస్సు కోసం ఉపయోగించే అనేక మొక్కల ఆధారిత పదార్థాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అలోవెరా గురించే. ఔషధ వినియోగంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన కలబంద.. బాగా ప్రజాదరణ కూడా పొందింది. దీనివల్ల చాలా బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి. గాయాలు, కాలిన గాయాలను నయం చేయగల సామర్థ్యాన్ని కలబంద కలిగి ఉంది. ఇవే కాదు చర్మం, జుట్టు, జీర్ణక్రియ, మొత్తం ఆరోగ్యం కోసం దీనిని ఉపయోగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబందను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలి?

అందం, ఆరోగ్య ఉత్పత్తులు ఇప్పుడు చాలా క్రియాశీలంగా మారిపోయాయి. అయితే మీరు కలబంద మొక్క నుంచి నేరుగా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. ఒక కొమ్మను కత్తిరించి.. లోపలున్న జెల్​తో మీరు నేరుగా ప్రయోజనాలు పొందుతారు. అయితే కలబందను అనేక సమస్యలకు ఉపయోగించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మం

మీరు కలబందను నేరుగా చర్మంపై ఉపయోగించవచ్చు. మొక్కనుంచి నేరుగా లేదా క్రీమ్‌ను వాడవచ్చు. మీకు వడదెబ్బ తగిలినా.. చర్మానికి ఉపశమనం కావాలన్నా దీనిని శరీరానికి అప్లై చేస్తే.. వేడిపోయి బాడీ చల్లబడుతుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి మాయిశ్చరైజర్‌గా కూడా కలబందను ఉపయోగించవచ్చు.

ముఖం

శరీరానికి ఎలా ఉపయోగిస్తామో.. అదే విధంగా కలబందను ముఖంపై కూడా ఉపయోగించవచ్చు. ఇది అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా సహజంగా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే ముఖం మీద అలోవెరా జెల్​ను తక్కువ మోతాదులో ఉపయోగించడమే మంచిది. ఎందుకంటే ముఖం కాస్త సున్నితంగా ఉంటుంది కాబట్టి.

జుట్టు

పొడవైన, మృదువైన జుట్టును ఎవరు కోరుకోరు. అందరికీ జుట్టు అంటే చెప్పలేని ఇష్టముంటుంది. మీరు కూడా అలాంటివారు అయితే ఈ అద్భుత పదార్ధం మీకు కచ్చితంగా సహాయం చేస్తుంది. జుట్టు పెరుగుదలను పెంపొందించి.. పోషణను అందిస్తుంది. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీనికోసం అలోవెరా జెల్​ను నేరుగా నెత్తిమీద లేదా ఇతర పదార్థాలతో కలిపి మాస్క్‌లా తలకు అప్లై చేయవచ్చు.

నోటి ఆరోగ్యం

చాలా మౌత్ వాష్, టూత్‌పేస్ట్‌లు కలబందను క్రియాశీల పదార్ధంగా కలిగి ఉంటాయి. అయితే పచ్చి కలబందను నోటి ద్వారా నేరుగా తీసుకోకపోవడమే మంచిది.

మెరుగైన జీర్ణ ఆరోగ్యం

కలబంద అతిసారం, మలబద్ధకం వంటి జీర్ణ రుగ్మతలను అదుపులో ఉంచుతుంది. కాబట్టి మీకు ఏవైనా కడుపు సమస్యలు ఉంటే కలబంద జ్యూస్ తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం