తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

How To Die Properly : చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ.. పిచ్చి పీక్స్ అనుకోకండి

Anand Sai HT Telugu

14 May 2024, 17:25 IST

google News
    • Japan Festival : మనిషి జీవితంలో చావు అనేది అత్యంత భయకరమైనది. ఇలాంటి విషయాన్ని పండుగ రూపంలో చేసుకోవడం అంటే వింతే కదా. జపాన్‌లో చావు ఎలా ఉంటుందో చూపించే పండుగ ఉంటుంది.
చావు పండుగ
చావు పండుగ

చావు పండుగ

మనిషి జీవితంలో చావు, పుట్టుక అనేవి మాత్రమే నిజాలు. మిగిలివి అన్ని మనిషి బతికి ఉన్నప్పుడు జరిగే ఘటనలు. మనిషి బతికే సమయంలో ఏం జరిగినా.. ఉండనంత పుట్టుక, చావు సమయంలో ఉంటుంది. నిజానికి పుట్టేటప్పుడు పక్కన ఉన్నవారు అంతా సంతోషిస్తారు. అదే చనిపోయేటప్పుడు మాత్రం అందరూ ఏడుస్తారు. మనిషికి ముగింపు చావే. అయితే ఈ చావును జపాన్ లో పండుగల కూడా చేస్తారు. అంటే బతికి ఉండగానే చనిపోతే ఏం జరుగుతుందో ముందుగానే చూపిస్తారన్నమాట.

అయితే ప్రపంచంలో ఇలాంటి పండుగ జరుపుకుంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ తప్పకుండా ఉంది. వారి మరణం సందర్భంలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూపిస్తారు. శవపేటికను కూడా తయారుచేస్తారు. మనకు ఇది చాలా పెద్ద విషయం. కానీ జపాన్ వారికి మాత్రం అతి చిన్న విషయం. ఈ పండుగ సమయంలో శవానికి వేసే బట్టలను ధరించి శవపేటికలో పడుకుంటాడు. మరణం గురించిన వర్క్‌షాప్‌లలో కూడా పాల్గొంటారు.

మన దగ్గర మరణం గురించి మాట్లాడటం మానేయమంటారు. దాని గురించి ఆలోచించడం కూడా అశుభం అని నమ్ముతారు. చిన్నప్పటి నుంచి చావు గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. కానీ జపాన్‌లో చూడండి మరణ పండుగనే జరుపుకొంటారు. అవును, టోక్యోలోని శుకత్సు ఉత్సవంలో మరణానికి ఎలా సిద్ధం కావాలో ప్రజలకు నేర్పిస్తారు.

జపనీస్ భాషలో శుకత్సు అంటే ఒకరి ముగింపు కోసం సిద్ధం. ప్రతి సంవత్సరం, డిసెంబర్ 16వ తేదీని శుకత్సు పండుగ దినంగా జరుపుకుంటారు. దీని ప్రధాన లక్ష్యం మరణం తర్వాత ఎలా ఉంటుంది? వారు పోయిన తర్వాత మిగిలిపోయిన వ్యక్తులకు ఏమి జరుగుతుందో ప్రజలకు తెలియజేయడం దీని ఉద్దేశం. సందర్శకులకు వివిధ వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాలు అందిస్తారు.

ఈ అనుభవాన్ని మరింత పెంచడానికి చాలా మంది పాల్గొనేవారిని మూసివున్న మూతలతో శవపేటికలలో ఉంచుతారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఎలా సిద్ధం చేయాలో కూడా సందర్శకులకు నేర్పిస్తారు.

జపాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధ జనాభాను కలిగి ఉంది. అయితే పండగ అంటే వృద్ధులకే కాదు. ఆసక్తిని కనబరిచే యువకులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉన్న, జీవించి ఉన్నప్పుడే ఎన్నో విషయాలు నిర్ణయించుకోవాలనుకునే వారి కోసం ఈ తరహా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ పండుగ మరణం దుఃఖాన్ని ప్రజలకు గుర్తు చేస్తుంది. అయినప్పటికీ, వారు దాని గురించి ప్రతికూలంగా ఆలోచించకూడదని, వారి ప్రియమైన వారిని బాగా చూసుకోవాలని ఇది ప్రజలకు మార్గనిర్దేశం చేస్తుంది. జీవితంలో పుట్టుక ఎంత ముఖ్యమో.. చావు కూడా అంతే ముఖ్యం. దేని గురించి చింతించాల్సిన పని లేదు. ఏది జరగాలో అది జరిగిపోతుంది అంతే.

నిజానికి జపాన్ ప్రజలు చాలా ఆరోగ్యవంతులు. ఎక్కువ కాలం జీవిస్తారు. దీని కారణం వారి తిండితోపాటుగా వారి ఆలోచన విధానం కూడా. ఇక్కడ ప్రజలు ఎక్కువగా సంతషంగా ఉండేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. మనలాగా ప్రతీ విషయాన్ని మనసుకు తీసుకుని బాధపడరు. చచ్చాక ఎలా ఉంటుందో చూపించే పండుగ ఏంట్రా బాబు అనుకోకండి. పిచ్చి పీక్స్ అని లెక్కలు వేసుకోకండి.. అది వారు పాటించే విధానం.

తదుపరి వ్యాసం