తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beauty Tips: అరబిక్ మహిళల ముఖచర్మం గులాబీ రంగులో మెరిసిపోవడానికి కారణం ఇదే, మీరూ అలా మారొచ్చు

Beauty Tips: అరబిక్ మహిళల ముఖచర్మం గులాబీ రంగులో మెరిసిపోవడానికి కారణం ఇదే, మీరూ అలా మారొచ్చు

Haritha Chappa HT Telugu

19 November 2024, 19:00 IST

google News
  • మీరు అరబిక్ మహిళల వలె మచ్చలేని పింక్ లుక్ కావాలనుకుంటే, ఈ రోజు మేము పాకిస్తాన్ వైద్యురాలు షిరీన్ ఫాతిమా చెప్పిన ఒక రెసిపీని మీతో పంచుకోబోతున్నాము. ఇది కొద్ది రోజుల్లోనే మీ చర్మంపై అద్భుతమైన మెరుపును ఇస్తుంది.

ముఖం గులాబీ రంగులో మారాలంటే ఇలా చేయండి
ముఖం గులాబీ రంగులో మారాలంటే ఇలా చేయండి (Instagram)

ముఖం గులాబీ రంగులో మారాలంటే ఇలా చేయండి

మచ్చలేని, మెరిసే చర్మం కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఇందుకోసం పలు రకాల ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో పాటు హోం రెమెడీస్ ను ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఇంట్లో పాటించే పద్ధతుల్లో పసుపు, గంధం, శనగపిండి, పెరుగు వంటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే అరబిక్ మహిళలను చూడండి… వారు పింక్ షేడ్ బుగ్గలతో మెరిసిపోతారు. వారికి ఆ గులాబీ రంగు ఎలా వస్తుందో తెలుసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. వారు నివసించే వాతావరణం వల్ల కూడా ఆ రంగు వస్తుందని అనుకుంటారు. నిజానికి వారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఆ పింక్ రంగు వస్తుందని ఇన్ స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉన్న ఓ పాకిస్తానీ డాక్టర్తన సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేసుకుంది. ఈ చిట్కాలు పాటించడం ద్వారా అరబిక్ మహిళల మాదిరిగా గులాబీ, ప్రకాశవంతమైన, మృదువైన చర్మాన్ని పొందవచ్చు. కాబట్టి ఈ అమేజింగ్ హోం రెమెడీని ఎలా ఫాలో అవ్వాలో తెలుసుకోండి.

రంగును పెంచే ఫేస్‌మాస్క్

ప్రతి అమ్మాయి పింక్ కలర్ చెంపలు కావాలని కోరుకుంటుంది. అయితే పింక్ గ్లో ఎలా వస్తుందో చాలా మందికి తెలియదు. మందార పువ్వులు, తేలికపాటి ఫేస్ సబ్బు, ఒక టీస్పూన్ బియ్యం పిండి, ఒక టీస్పూన్ బీట్ రూట్ పౌడర్, ఒక టీస్పూన్ పాల పొడి, ఒక టీస్పూన్ మొక్కజొన్న పిండి తీసుకోండి.

కొన్ని మందార పువ్వులను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. వాటిని రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన సబ్బును ఒక గిన్నెలో బాగా తురుముకోవాలి. దీని కోసం, తేలికపాటి సబ్బును ఉపయోగించుకోవాలి. దీని తరువాత ఒక సబ్బు గిన్నెలో బియ్యం పిండి, బీట్ రూట్ పొడి, పాల పొడి, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన మందార పువ్వుల నీటిలో ఆ పిండి మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. పేస్ట్ తయారైన తర్వాత ఐస్ క్యూబ్ ట్రేలో వేసి సెట్ చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్ లో పెట్టి కొన్ని గంటల పాటూ ఉంచాలి. తరువాత వాటిని వాడవచ్చు. వీటిని ఒక్కసారి చేసుకుంటే రోజూ రెండు వారాల పాటు వాడుకోవచ్చు.

తయారుచేసిన ఐస్ క్యూబ్స్ ను మీ దినచర్యలో భాగంగా వాడుకోవచ్చు. వాటితో ఫేస్ పై రుద్దుతూ ఉండాలి. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఐస్ క్యూబ్ ను ముఖానికి కాసేపు మసాజ్ చేసి ముఖం కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజుల పాటూ రుద్దితే మీ ముఖం మునుపటి కంటే మరింత ప్రకాశవంతంగా, మచ్చలేనిదిగా మారుతుంది. గులాబీ రంగులోకి మారుతుంది. మీకు కొన్ని రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది.

తదుపరి వ్యాసం