బంగారం కొంటున్నారా..? మోసపోకూడదంటే ఈ జాగ్రత్తలను తెలుసుకోండి!
17 April 2022, 23:23 IST
- బంగారం కొనగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం..
GOLD ornaments
భారతీయులకు బంగారం ఆభరణాలంటే మక్కువ ఎక్కువ.. సురిక్షితమైన పెట్టుబడిగా, అలంకరణ కోసం బంగారానికి అధిక ప్రాధన్యతను ఇస్తుంటారు. శుభకార్యాలు, అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఇలా సందర్భం ఏదైనా భారతీయులు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారం కొనగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.లేకపోతే మోసానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం..
బంగారం ధరలు:బంగారం కొనుగోలుకు ముందు వాటి ధరను తెలుసుకోవడం చాలా ముఖ్యం. రోజు.. రోజుకు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఒక్కో నగరంలో ఒక్కోలా మారుతుంటాయి. కొనుగోలు చేసే ధరను చూసుకోవాలి .
Purity of gold: బంగారం కొనుగోలు చేసేటప్పుడు దాని స్వచ్ఛత చూడడం చాలా ముఖ్యం. సాధరణంగా బంగారం స్వచ్ఛత క్యారెట్లలలో ఉంటుంది. సాధరణంగా బంగారం ఆభరణాలు 22 క్యారెట్లు. 24 క్యారెట్లు లభిస్తుంటాయి. 24 క్యారెట్లు స్వచ్ఛమైన బంగారంగా భావిస్తుంటారు. కొనగోలు చేసే స్వచ్చమైనదా..? కాదా..? చూసుకోవాల్పి ఉంటుంది.
హాల్ మార్కింగ్: సాధరణంగా బంగారు ఆభరణాలను స్వచ్చమైన గోల్డ్‌తో తయారు చేయడం కుదరదు. కావున ఇతర లోహాలను కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. అయితే మీరు ఆభరణాలను కొనే ముందు ఆ లోహాలు ఎంత వరకు కలపారన్న విషయాన్ని తెలుసుకోవాలి. హాల్‌మార్క్ గుర్తును బట్టి ఆభరణాల స్వచ్ఛతను చూడాలి. బంగారు ఆభరణంలపై బీఐఎస్ హాల్ మార్క్ ఉంటే అది మంచి బంగారంగా భావించాలి.
కొనుగోలు ముందు గుర్తుంచుకోవాల్పినవి: బంగారం కొనుగోలుకు ముందు ధరలకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవాలి. ఎంఎంటీసీ వంటి ఇతర మార్గాలు ద్వారా కూడా అన్వేషించాలి. స్వర్ణకారులు, షోరూం ద్వారానే కాకుండా బ్యాంకుల ద్వారా కూడా గోల్డ్ కాయిన్‌లను కొనగోలు చేయవచ్చు. బ్యాంకులు చాలా వరకు 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లే ఎక్కువగా విక్రయిస్తారు.
టాపిక్