తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gold Price | స్థిరంగా బంగారం ధరలు.. మీ నగరాల్లో ఎంతంటే?

Gold Price | స్థిరంగా బంగారం ధరలు.. మీ నగరాల్లో ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

17 April 2022, 6:21 IST

google News
    • తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,060 గా ఉంది.
బంగారం ధరలు
బంగారం ధరలు

బంగారం ధరలు

మెున్నటి వరకు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అయితే తాజాగా.. నిన్న, ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం 49,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54,060గా ఉంది. ఇక ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.74,200 వద్ద ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 200 రూపాయలు తగ్గింది.

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీలో ధరలివే..

విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ.49,550గా కొనసాగుతోంది. 24 క్యారెట్స్ బంగారం ధర 54,060గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గి రూ.74,200గా కొనసాగుతోంది. అయితే గత నాలుగు రోజుల వ్యవధిలో బంగారం ధర చూస్తే రూ. 900 వరకు పెరిగింది.

దేశంలో ధరలివే..

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరల్లో వ్యత్యాసం ఉంది. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.50,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,700గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,060 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 గా ఉంటే 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ రూ. 54,060గా ఉంది.

ప్లాటినం ధరలు..

సంపన్నులు ఎక్కువగా ఇష్టపడే.. ప్లాటినం ధరలు సైతం.. ఎక్కువగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటినం ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.24,250గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉన్నాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వంటి అంశాలు కూడా ప్రభావితం చేస్తున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం