Chanakya Niti Telugu : ఈ సంకేతాలు మీ ఇంట్లో చాలా ఆర్థిక ఇబ్బందులను తీసుకొస్తున్నాయని అర్థం!
17 April 2024, 8:03 IST
- Chanakya Niti On Financial Crisis : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. డబ్బుకు సంబంధించిన వివిధ విషయాలను తెలిపాడు.
చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడి చాణక్య నీతి అనేది జీవితంలో ఒక పరీక్షగా నిలిచే జీవిత పాఠాల సమాహారం. చాణక్యుడు గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు, ఆర్థికవేత్త, అతని బోధనలు అన్ని కాలాలకు సంబంధించినవి. చాలా మంది ఇప్పటికీ చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తారు. దీనితో జీవితం సంతోషంగా జీవించవచ్చు. ఎందుకంటే చాణక్యుడు చెప్పే ప్రతీ విషయం జీవితంతో కచ్చితంగా ముడిపడి ఉంటుంది.
జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ కొన్ని సమస్యలు మాత్రం ముందుగానే మనకు హెచ్చరికలు పంపుతాయి. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోం. మన జీవితంలో సమస్యల సంకేతాలను గుర్తించడమనేది అసలు విషయం. ఆర్థిక సంక్షోభాల సంకేతాలను ముందస్తుగా గుర్తించడం వల్ల అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రాబోయే ఆర్థిక సంక్షోభానికి ముందస్తు హెచ్చరిక సంకేతాలు ఏంటో తెలుసుకుందాం..
తులసి మెుక్క ఎండిపోవడం
హిందూ మతం ప్రకారం తులసి మొక్క చాలా గృహాలలో దేవతగా పూజించబడే ఒక పవిత్రమైన మొక్క. తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే, అది రాబోయే పేదరికానికి సంకేతంగా పరిగణించబడుతుంది అని చాణక్య నీతి చెబుతోంది. అయితే నీటి కొరత, చల్లని వాతావరణం కారణంగా కొన్నిసార్లు మొక్కలు ఎండిపోతాయని గమనించడం ముఖ్యం. సరైన వాతావరణంలో కూడా తులసి ఎండిపోవడం పేదరికానికి సంకేతం. అందుకే తులసి మెుక్కను జాగ్రత్తగా చూసుకోండి.
ఇంట్లో గొడవలు
ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా మీ ఇంట్లో నిరంతరం తగాదాలు, వాదనలు ఉంటే అది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం కావచ్చు. గ్రహ దోషం లేదా వాస్తు దోషం వంటి సమస్యలు కూడా దీనికి కారణమని చాణక్యుడు నమ్మాడు. కారణం లేకుండా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. దీనితో అనేక సమస్యలు వస్తాయి. మానసికంగా, ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమస్యలు అనేవి మీ వెంటే ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీరు ఆర్థికంగా కిందకు దిగుతారని గుర్తించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో గాజు పగలడం
చాణక్యుడు ప్రకారం, మీ ఇంట్లో పదేపదే గాజు పగలడం రాబోయే ఆర్థిక నష్టానికి సంకేతంగా చెప్పవచ్చు. ఇది మీ ఇంటిలో రాబోయే పేదరికాన్ని సూచిస్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోంటారు.
భగవంతుడిపై విశ్వాసం
ప్రశాంతమైన జీవితానికి భగవంతునిపై విశ్వాసం చాలా ముఖ్యం. పూజలు లేని చోట సుఖం లేదా శ్రేయస్సు ఉండదని చాణక్యుడు చెప్పాడు. పూజలు లేకపోవటం, పూజలు చేయలేని వాతావరణం రావటం ఆర్థిక సమస్యలకు సంకేతమని చాణక్యుడు చెప్పాడు. అందుకే నమ్మకంతో భగవంతుడిని పూజించడం అనేది ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. లేదంటే ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి.
పెద్దలపై గౌరవం
పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగం. పెద్దలను అగౌరవపరచడం రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతమని చాణక్యుడు నమ్మాడు. పెద్దల పట్ల అమర్యాదగా ప్రవర్తించే వారు జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరని అన్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారని చాణక్య నీతి వివరిస్తుంది. చాణక్యుడ తన అనుభవంతో చాణక్య నీతి చెప్పాడు. వీటిని పాటిస్తే జీవితంలో ముందుకు వెళ్లవచ్చు.