Unhealthy Food: ఈ ఆహారాలన్నీ అనారోగ్యకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది, కానీ అవి మంచివేనని మనం తినేస్తున్నాం
25 August 2024, 10:30 IST
- Unhealthy Food: మనం ఏవైతే ఆరోగ్యకరమైన ఆహారాలు అనుకుంటున్నామో అవి అనారోగ్యకరమని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అలాంటి ఆహార పదార్థాలు ఏంటో కూడా వివరిస్తోంది.
ఎలాంటి ఆహారాలు తినడం మానేయాలి?
Unhealthy Food: ప్రపంచ ఆరోగ్య సంస్థ మనం తినే ఆహారాలు, తాగే పానీయాల గురించి ఒక నివేదికలో కొన్ని ముఖ్యమైన అంశాలను వివరించింది. ఏవైతే మనం మంచి ఆహారాలు ఆరోగ్యకరమని భావించి తింటున్నాము. వాటిని అనారోగ్యకరమైనవని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మనం రోజూ తినే ఆహారాల్లో చాలామటుకు అనారోగ్యకరమైనవి ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. శారీరక ఆరోగ్యం కోసం ఆధునిక కాలంలో కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఇష్టంగా తినే చాలా ఆహారాలు మనకి ఎంతో కీడును చేస్తాయని. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ఆహారాల జాబితాను కూడా విడుదల చేసింది.
చీజ్
చీజ్ తినే వారి సంఖ్య ప్రపంచంలో చాలా ఎక్కువ. అంతెందుకు ప్రపంచంలో ఎక్కువ దొంగతనానికి గురయ్యే పదార్థం కూడా చీజ్. అంటే దాన్ని ఎంతగా మనం తింటున్నామో అర్థం చేసుకోండి. చీజ్ దోశ నుంచి చీజ్ పిజ్జా వరకు రకరకాలుగా చీజ్‌ను వాడుతున్నాము. ఇది పాల ఉత్పత్తి కావచ్చు. కానీ దీనిలో సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి.ముఖ్యంగా గుండె జబ్బులు, ఊబకాయం బారిన పడేలా చేస్తాయి.
బంగాళాదుంప
బంగాళదుంపను బాగా ఉడకబెట్టి తింటే మంచిదే. కానీ బంగాళదుంపలతో చిప్స్, వేపుళ్ళు వంటివి చేసి తినేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. బంగాళదుంపను స్నాక్స్ రూపంలో తింటే అది చాలా అనారోగ్యకరమైనది. దీనిలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే క్యాలరీలు కూడా ఎక్కువే.
కాఫీ
కాఫీ రోజులో ఒకసారి తాగితే ఉత్సాహంగానే ఉంటుంది. కానీ రోజులో రెండు మూడు సార్లు తాగితే మాత్రం అది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఉండే కెఫీన్ తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి, నిరాశ, అలసట, డిప్రెషన్ వంటి సమస్యలను కలిగిస్తుంది. వీలైనంతవరకు కాఫీను తాగడం మాని గ్రీన్ టీ తో సరిపెట్టుకోవడం ఉత్తమం.
బ్రెడ్
పాస్తా, బ్రెడ్, నూడుల్స్ ఇవన్నీ కూడా శుద్ధి చేసిన ఆహారాల జాబితాలోకి వస్తాయి. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు వీటిలో అధికంగా ఉంటాయి. వీటిని తరుచూ తినడం వల్ల డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. అలాగే ప్రాసెస్ చేసిన ఏ ఆహారానికైనా దూరంగా ఉండాలి.
వేపుళ్ళు
వేయించిన ఆహారాన్ని అధికంగా తినేవారు ఉన్నారు. దీనిలో అధిక కేలరీలు ఉంటాయి. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన కొవ్వులు నిండి ఉంటాయి. కానీ డీప్ ఫ్రై చేసిన చికెన్ నగ్గేట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ తినేవారు. త్వరగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం మంచిది.
తీపి పదార్థాలు
తీపి పదార్థాలను అధికంగా చక్కెరతోనే చేస్తారు. చక్కెర ఒక ప్రాసెస్ చేసిన పదార్థం చక్కెరతో నిండిన స్వీట్లు, చాక్లెట్లు తినడం వల్ల ఉబకాయం, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కాలేయం, ప్యాంక్రియాస్, జీర్ణ వ్యవస్థ పై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి చక్కెర నిండిన ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
టాపిక్