తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో పెళ్లి ఉంగరం పోయింది, అది ఎక్కడుందో కనిపెడితే మీ తెలివితేటలు సూపర్

Optical Illusion: ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో పెళ్లి ఉంగరం పోయింది, అది ఎక్కడుందో కనిపెడితే మీ తెలివితేటలు సూపర్

Haritha Chappa HT Telugu

11 March 2024, 9:31 IST

google News
    • Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి మరొకచిత్రం ఇది. ఇందులో పెళ్లి ఉంగరం పోయింది. ఓ చోట అది దాక్కుని ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టండి.
ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తికరంగా ఉంటాయి. వాటిని సాల్వ్ చేస్తే మీ తెలివితేటలు ఏ పాటివో అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఒక పెళ్లి జరుగుతోంది. పెళ్లిలో పెట్టాల్సిన వజ్రపు ఉంగరం పోయింది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ పని ఈ ఫోటోలు చూస్తే ఆ ఉంగరం ఎక్కడో ఒక దగ్గర దాక్కొని ఉంటుంది. దాన్ని మీరు కేవలం 10 సెకన్లలో కనిపెట్టాలి. అలా కనిపెడితే మీ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషియంట్. తెలివితేటలు అధికంగా ఉండటమే ఐక్యూ లెవెల్స్ సూచిస్తాయి.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మధ్యలో పూజారి ఉన్నారు. పెళ్ళికొడుకు ఉంగరం కనబడక కంగారు పడుతున్నాడు. దీనివల్ల పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఎంత వేగంగా ఉంగరాన్ని వెతికిస్తే ఆ పెళ్లి జరిగిపోతుంది. మీ ఐక్యూ లెవెల్స్ అధికంగా ఉంటే ఈపాటికి మీరు ఉంగరాన్ని కనిపెట్టేసి ఉండాలి. ఓ 10 సెకన్ల సమయం తీసుకుని ఆ ఉంగరం ఎక్కడుందో చూడండి. ఫోటోలో చాలా స్పష్టంగా ఆ ఉంగరం కనిపిస్తోంది.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఉంగరాన్ని పది సెకన్లలో కనిపెట్టిన వారు చాలా తెలివైన వారని అర్థం. ఇక దీని జవాబు చెప్పేస్తున్నాం. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో పైన తోరణాల బల్బులు కనిపిస్తున్నాయి. పెళ్లికూతురు తల మీద ఉన్న రెండు బల్బుల మధ్య ఏదో ఇరుక్కుని ఉంది... ఒకసారి చూడండి. దగ్గరగా చూస్తే తెలిసిపోతుంది అదే ఉంగరం అని. అదే పెళ్ళికొడుకు వెతుక్కుంటున్నా వివాహ ఉంగరం.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యుషన్లో ఇంటర్నెట్లో ఎన్నో వైరల్ అవుతున్నాయి. అలాగే ఇన్ స్టాపేజీల్లో, ట్విట్టర్ ఖాతాలో, ఫేస్ బుక్‌లో ఎంతోమంది వీటిని షేర్ చేస్తూ, సాల్వ్ చేస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. మీకు కూడా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమైతే ప్రతిరోజు ఒక ఆప్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేయడం ప్రారంభించండి. ఇలా చేయడం వల్ల మీ తెలివితేటలు పెరుగుతాయి. మీకు మంచి టైం పాస్ కూడా లభిస్తుంది. ఆప్టికల్ ఇల్యూషన్లో ఎన్నో రకాలు ఉన్నాయి. పిల్లల చేత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చేయించడం వల్ల వారికి అభిజ్ఞా శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరే మారుతుంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.

ఆప్టికల్ ఇల్యూషన్లలో నెంబర్ టెస్ట్, కనిపించకుండా పోయిన వస్తువులను కనిపెట్టడం వంటి రకాలు ఉన్నాయి. ఇవి చాలా వినోదాన్ని పంచుతాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చరిత్రపై ఎన్నో వాదనలు ఉన్నాయి. ఇవి ఎక్కడ పుట్టాయన్నది లిఖిత పూర్వక ఆధారాలు దొరకలేదు. కానీ చరిత్రకారులు మొదటగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను గ్రీసు దేశంలో బయటపడినట్టు చెబుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం