Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 257 సంఖ్య ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించండి, అలా చేస్తే మీ కంటి చూపు సూపర్-optical illusion find out where the number 257 is in this optical illusion in ten seconds your eyesight will be super ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 257 సంఖ్య ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించండి, అలా చేస్తే మీ కంటి చూపు సూపర్

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 257 సంఖ్య ఎక్కడుందో పది సెకన్లలో గుర్తించండి, అలా చేస్తే మీ కంటి చూపు సూపర్

Haritha Chappa HT Telugu
Mar 08, 2024 10:40 AM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ నెంబర్ 257 నెంబర్ ఉంది దాన్ని కనిపెట్టండి

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లో పురాతన కాలం నుంచి మనుషులకు వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. అవి మనుషుల అవగాహన, గ్రహణ శక్తికి సవాలును విసురుతాయి. కనిపించడానికి సులువుగా అనిపించినా... పరిష్కరించేటప్పుడు మాత్రం కాస్త కష్టంగా ఉంటాయి. మీ మెదడు సామర్థ్యానికి ఇవి సవాలు విసురుతాయి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్... ఇంటెలిజెన్స్ కోషియెంట్ పరీక్షకు కూడా ఉపయోగపడతాయి. మీ ఐక్యూ స్థాయిలు అధికంగా ఉంటే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ త్వరగానే సాధించవచ్చు.

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 257 అనే అంకె దాగుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 2S7 అనే నెంబర్లు, అక్షరాలు కలిసిన పదం ఉంది. దాని మధ్యలోనే ఒక 257 దాక్కుంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ పని. ఎక్కువ సమయం ఇస్తే ఎవరైనా కనిపెడతారు. కేవలం 10 సెకన్లలోనే కనిపెట్టి చెబితే... మీ కంటి చూపు సూపర్ అని చెప్పొచ్చు.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

పది సెకన్లలోనే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఆ సమయంలోనే మీరు కనిపెట్టారంటే మీ కంటి చూపు, మెదడు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు మానసికంగా చాలా చురుకుగా ఉన్నారని కూడా అర్థం. ఇక జవాబు విషయానికి వస్తే చివరి నుంచి రెండో నిలువ వరసలో ఓ చోట మధ్యలో ఉంది 257 అనే నెంబర్.

ఆప్టికల్ ఇల్యూషన్లు మీ మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మీలో ఏకాగ్రతను పెంచుతాయి. మీ మెదడు, కంటి చూపు మధ్య సమన్వయం అధికంగా ఉండేలా సహాయపడతాయి. అలాగే మీకు సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. నిజానికి ఇక్కడ ఉన్న 257 నెంబర్‌ను తీక్షణమైన పరిశీలనా నైపుణ్యాలు కలిగిన వ్యక్తులలో ఒక శాతం మంది మాత్రమే. పది సెకన్లలో కనిపెట్టగలరు. మిగతా వారందరికీ కాస్త సమయం పడుతుంది. మీరు టైమర్ పెట్టుకొని దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.

ఆప్టికల్ ఇల్యూషన్లు ఈనాటివి కావు. వేల ఏళ్ల నుంచి ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. గ్రీకు దేశం నుంచి ఇతర దేశాలకు నీ ప్రయాణం కట్టిందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గ్రీకు దేశంలోని అనేక పురాతన కట్టడాలలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ జాడ కనిపించింది. ఇక అక్కడ నుంచే ఇతర ఖండాలకు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు చేరి ఉంటాయని అంచనా. ప్రస్తుతం విదేశాల్లో ఎంతోమంది ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు. సోషల్ మీడియా వచ్చాక వీటికి ఎంతగానో ఆదరణ పెరిగింది.

Whats_app_banner