తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tcs Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్.. అర్హతలు.. దరఖాస్తు విధానం ఇదే!

TCS Recruitment 2022: టీసీఎస్‌లో జాబ్.. అర్హతలు.. దరఖాస్తు విధానం ఇదే!

HT Telugu Desk HT Telugu

01 May 2022, 17:03 IST

google News
    • దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ TCS మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. టీసీఎస్ ఎంబీఏ హైరింగ్‌ పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
TCS Recruitment 2022
TCS Recruitment 2022

TCS Recruitment 2022

దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) భారీగా రిక్రూట్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను స్టార్ట్ చేసింది. ఈ డ్రైవ్స్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కి అధిక ప్రాధన్యతను ఇస్తోంది. ఈ సారి ఎంబీఏ కోర్సు పూర్తి చేసినవారికి TCS అవకాశం  కల్పిస్తోంది. తాజాగా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. టీసీఎస్ ఎంబీఏ హైరింగ్‌ పేరుతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

అర్హతలు- అభ్యర్థులు తప్పనిసరిగా 2 సంవత్సరాల MBA/MMS/ PGDBA/PGDM/ కోర్సుతో- మార్కెటింగ్ / ఫైనాన్స్ / ఆపరేషన్స్ / సప్లై చైన్ మేనేజ్‌మెంట్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / జనరల్ మేనేజ్‌మెంట్ / బిజినెస్ అనలిటిక్స్ / ప్రాజెక్ట్‌లో మేనేజ్‌మెంట్ పూర్తి చేసి ఉండాలి. మొత్తం అకడమిక్ గ్యాప్ 2 సంవత్సరాలకు మించకూడదని TCS తెలిపింది.

MBA/ఇంటిగ్రేటెడ్ MBAకి ముందు B.Tech లేదా BE నేపథ్యం తప్పనిసరి అని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే, 2020, 2021,  2022 పాసింగ్ అవుట్ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని  తప్పక గమనించాలి.

TCS MBA నియామకం కోసం ఎలా నమోదు చేసుకోవాలి?

Step 1: అభ్యర్థులు ముందుగా TCS కెరీర్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

ఈ  లింక్  ఓపెన్ చేసి దరఖాస్తు ప్రక్రియ మెుదలుపెట్టండి.

Step 2. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు డైరెక్ట్ లాగిన్ చేసి, 'Apply for drive' ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తును పూర్తి చేయవచ్చు. కొత్త దరఖాస్తుదారులైతే ముందుగా తమ రిజిస్ట్రేషన్‌ని పూర్తి చేసి, 'IT' కేటగిరీని ఎంచుకోవాలి. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, 'Apply for drive' ఎంపికపై క్లిక్ చేయండి.

Step 3: పరీక్ష మోడ్‌ను రిమోట్‌గా ఎంచుకుని, 'Apply'పై క్లిక్ చేయండి.

step 4: మీ సెటస్‌ను తెలుసుకోవడానికి 'Track your application' ద్వారా చెక్ చేయవచ్చు.

step 5: Applied for Drive అని స్టేటస్ ఉంటే దరఖాస్తు ప్రక్రియ విజయవంతం అయినట్లుగా అర్థం

టాపిక్

తదుపరి వ్యాసం