తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Jobs: గ్రూపు -2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ విషయాలు తెలియాల్సిందే

TSPSC Jobs: గ్రూపు -2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ విషయాలు తెలియాల్సిందే

HT Telugu Desk HT Telugu

01 May 2022, 8:00 IST

google News
    • తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. ఇప్పటికే పోలీసు శాఖ నుంచి నోటిఫికేషన్లు వచ్చేశాయ్. ఇక టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 వచ్చింది. మరోవైపు గ్రూపు 2, 3,4 కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి గ్రూపు - 2 ఉద్యోగాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది.
గ్రూపు 2 ఉద్యోగాల సిలబస్
గ్రూపు 2 ఉద్యోగాల సిలబస్

గ్రూపు 2 ఉద్యోగాల సిలబస్

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అన్ని శాఖలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ భారీ స్థాయిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక 500కు పై పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు గ్రూపు 1, 2 లో ఇంటర్వూలు కూడా ఎత్తివేశారు. ఈ నిర్ణయం అభ్యర్థులకు మరింత కలిసివచ్చే అవకాశం ఉంది. అయితే గ్రూపు-2లోని ఉద్యోగాలు ఏంటి..? సిలబస్ స్వరూపం..? వంటి అంశాలపై చాలానే డౌట్స్ ఉంటాయి. అయితే ఇందుకు సంబంధించిన అంశాలను చూస్తే...

గ్రూపు -2లోని ఉద్యోగాలు..

మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్(ఏసీటీవో), డిప్యూటీ తహసీల్దార్‌ (నాయిబ్‌ తహసీల్దార్‌), సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2, జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కో–ఆపరేటివ్‌ సబ్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (మండల పంచాయతీ అధికారి), ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (పీఆర్‌), అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ఎండోమెంట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సెక్రెటేరియట్, లెజిస్లేచర్, ఫైనాన్స్‌, లా).

పరీక్ష విధానం

కేవలం రాత పరీక్ష మాత్రమే ఉంటుంది. గతంలో ఉన్న ఇంటర్వూ విధానాన్ని ఎత్తివేశారు. పరీక్షలో భాగంగా నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 ప్రశ్నలకు గానూ.. 150 మార్కులు కేటాయిస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానం చేయాలి. ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. నాలుగు పేపర్లకు గానూ మొత్తం 600 మార్కులు ఉంటాయి. ఇందులో గరిష్ట మార్కులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఒక్కో పేపర్ రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది.

సిలబస్ ఇదే…

పేపర్ - 1లో జనరల్‌ స్టడీస్ ఉంటుంది. ఇందులో కరెంట్ ఎఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, సామాన్యశాస్త్రం, భారతదేశ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, భౌగోళిక అంశాలు, భారత రాజ్యాంగం: ప్రధాన లక్షణాలు , భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ సాంఘిక, సాంస్కృతిక, వారసత్వ అంశాలు, కళలు, సాహిత్యంతో పాటు తెలంగాణ రాష్ట్ర విధానాల వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఇక పేపర్ - 2 లో హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ ఉంటుంది. ఇందులో భాగంగా భారతదేశ మరియు తెలంగాణ సామాజిక సాంస్కతిక చరిత్ర, భారత రాజ్యాంగం మరియు రాజకీయాల పర్యావలోకనం, సోషల్‌ స్ట్రక్చర్, ఇష్యూస్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇక పేపర్ -3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఉంటుంది. ఇందులో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సవాళ్లు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, ఇష్యూస్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఛేంజెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

ఇక చివరగా పేపర్ -4లో తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం ఉంటుంది. దీంట్లో భాగంగా తెలంగాణ ఆలోచన పుట్టుక (1948–1970), మద్దతు కూడగట్టే దశ (1971–1990), తెలంగాణ ఏర్పాటు దిశగా... అంటే మొత్తం మూడు దశాల్లో ఏం జరిగింది..? కీలక పరిణామాలు, ఘటనల గురించి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్ కు 150 మార్కులు కేటాయిస్తారు.

 

టాపిక్

తదుపరి వ్యాసం