Veg Millet Upma Recipe । ఆరోగ్యకరమైన మిల్లెట్ ఉప్మా.. పిల్లలు ఇష్టంగా తింటారు!
09 July 2023, 6:30 IST
- Mixed Vegetable Millet Upma Recipe: పిల్లలకు ఏదైనా రుచికరంగా ఉంటేనే తింటారు. ఇక్కడ రుచికరమైన, ఆరోగ్యకరమైన మిక్స్‌డ్ వెజిటబుల్ మిల్లెట్ ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.
Vegetable Millet Upma Recipe
Healthy Breakfast Recipes: ఇంట్లో స్కూల్ కు వెళ్లే పిల్లలు ఉంటే రోజూ ఉదయం వారిని సిద్ధం చేయడం తల్లిదండ్రులకు పెద్ద టాస్క్. మరీ ముఖ్యంగా వారికి బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలో అని గందరగోళంలో ఉంటారు. కష్టపడి ఏదో ఒకటి సిద్ధం చేస్తే అది వారికి నచ్చక తినకుండానే వెళ్లిపోతారు. పిల్లలకు ఏదైనా రుచికరంగా ఉంటేనే తింటారు. ఇక్కడ మీకు అలాంటి ఒక రెసిపీని పరిచయం చేస్తున్నాం.
ఉప్మా ప్రతీ ఇంటిలో సాధారణంగా వండుకొనే అల్పాహారం. అయితే ఈ ఉప్మాను మరింత ఆరోగ్యంగా మార్చడానికి రవ్వకు బదులు మిల్లెట్లు ఉపయోగించండి. రుచికోసం వివిధ రకాల కూరగాయలు కలపొచ్చు. అప్పుడు ఈ అల్పాహారం మరింత పోషకభరితం అవుతుంది. మిక్స్‌డ్ వెజిటబుల్ మిల్లెట్ ఉప్మా రెసిపీని ఈ కింద చూడండి.
Mixed Vegetable Millet Upma Recipe కోసం కావలసినవి
- 1 కప్పు జొన్నలు
- ½ కప్పు ఉల్లిపాయ ముక్కలు
- ½ కప్పు క్యారెట్ ముక్కలు
- ½ కప్పు టమోటా ముక్కలు
- ½ కప్పు క్యాప్సికమ్ ముక్కలు
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- ½ స్పూన్ ఆవాలు
- ½ స్పూన్ జీలకర్ర
- 1 స్పూన్ వెల్లుల్లి-అల్లం పేస్ట్
- రుచికి ఉప్పు
- 1½ కప్పుల నీరు
- గార్నిషింగ్ కోసం కొత్తిమీర
మిక్స్‌డ్ వెజిటబుల్ మిల్లెట్ ఉప్మా తయారీ విధానం
- ఈ ఉప్మా తయారీకి ముందు రోజు రాత్రి, జొన్నలను బాగా కడిగి, రాత్రంతా నీటిలో నానబెట్టాలి.
- తరువాత ఉదయం నానబెట్టిన జొన్నలను మెత్తగా ఉడికించుకోవాలి.
- అనంతరం మైక్రోవేవ్-సేఫ్ గిన్నెలో, నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. మూడు నిమిషాలు అధిక శక్తితో మైక్రోవేవ్‌లో ఉడికించాలి. లేదా స్టవ్ మీదనైనా ఉడికించుకోవచ్చు.
- ఆ తర్వాత ఉడికించిన జొన్నలు, టమోటాలు వేసి, బాగా కలిపి నాలుగు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు కొన్ని వేడి నీరు వేసి బాగా కలపండి, మళ్లీ ఏడు నిమిషాలు ఉడికించాలి.
- చివరగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించండి.
అంతే మిక్స్‌డ్ వెజిటబుల్ జొన్నల ఉప్మా రెడీ. చట్నీ లేదా ఊరగాయతో వేడివేడిగా వడ్డించండి.
టాపిక్