తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Palak Chicken Recipe : చికెన్​ను మరింత హెల్తీగా తీసుకోవాలి అంటే.. ఈ రెసిపీ ట్రై చేయండి..

Palak Chicken Recipe : చికెన్​ను మరింత హెల్తీగా తీసుకోవాలి అంటే.. ఈ రెసిపీ ట్రై చేయండి..

10 December 2022, 12:55 IST

google News
    • Palak Chicken Recipe : మీరు చికెన్​ను కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. మరింత పోషకాలు జోడించాలి అనుకుంటే మీరు కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయాలి. అది ఏమి రెసిపీ అనుకుంటున్నారా? అదే పాలకూర చికెన్. దీనిలో మీకు ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో దొరుకుతుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలామంచిది. 
పాలకూర చికెన్
పాలకూర చికెన్

పాలకూర చికెన్

Palak Chicken Recipe : చాలామంది చికెన్ ఇష్టంగా తింటారు. అయితే మరికొందరు దానిని ప్రొటీన్ కోసం మాత్రమే తింటారు. అయితే చికెన్ పోషకాలు పెంచుతూ.. టేస్ట్ కూడా అందించే రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆకుకూరగాలు ఆరోగ్యానికి మంచివని.. మన అందరికీ తెలుసు. ముఖ్యంగా పాలకూర అనే ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాకుండా దీని టేస్ట్ చికెన్​తో మరింత రెట్టింపు అవుతుంది. ఈ టేస్టీ, హెల్తీ కర్రి ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* చికెన్ - 500 గ్రాములు

* పసుపు - 1 టీస్పూన్

* కారం - 1 టీస్పూన్

* గరం మసాలా - 1 టీస్పూన్

* ధనియా పొడి - 1 టీస్పూన్

* అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 4 టేబుల్ స్పూన్

* పాలకూర - 4 టేబుల్ స్పూన్స్

* పచ్చిమిర్చి - 5

* మెంతి కూర - 1 టేబుల్ స్పూన్

* టొమాటోలు - 2

* పెద్ద ఉల్లిపాయ - 1

* జీలకర్ర - 1/2 టీస్పూన్

*- దాల్చిన చెక్క - 1 అంగుళం

* క్రీమ్ - 1 టేబుల్ స్పూన్

* గరం మసాలా – 1/2 టీస్పూన్ గరం

* పెరుగు - పావు కప్పు

తయారీ విధానం

ముందుగా ఓ గిన్నె తీసుకుని దానిలో చికెన్‌ వేసి.. ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టేయండి. కొత్తిమీర, మెంతి ఆకులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పులను వేసి.. దాని బ్లెండ్ చేయాలి. పాలకూరను దీనిలో వేయకూడదు. ముందు పాన్ వేడి.. నూనె వేయండి. దానిలో పాలకూరను వేయాలి. దానిపై మూత పెట్టి 5 నిముషాలు ఉడకనివ్వండి. అది పేస్ట్ మాదిరిగా ఉడుకుతుంది. దానిని పక్కన పెట్టేయండి.

ఇప్పుడు అదే పాన్​లో నూనె వేసి.. జీలకర్ర వేయండి. దానిలో ఉల్లిపాయ వేసి వేయించండి. అవి బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించండి. దానిలో టొమాటోలు వేసి.. మెత్తగా ఉడికే వరకు వేయించండి. దానిలో మెరినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఉడకనివ్వండి. చికెన్ ఉడుకుతుంది అనిపించినప్పుడు.. దానిలో పాలకూర, కొత్తిమీర ఆకుల పేస్ట్ వేయండి. బాగా కలిపి మూత వేసి 5 నిముషాలు ఉంచండి. అనంతరం గరం మసాలా పౌడర్ వేసి.. మూతపెట్టకుండా 2 నిముషాలు ఉడికించండి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి.. దానిలో 1 టేబుల్ స్పూన్ తాజా హెవీ క్రీమ్ కలపండి. దీనిని మీరు చపాతీ, అన్నంతో కలిపి హ్యాపీగా లాగించేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం