తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sexy Spinach Smoothie Recipe : ఆరోగ్యానికి, అందానికి.. సెక్సీ స్పినాచ్ స్మూతీ..

Sexy Spinach Smoothie Recipe : ఆరోగ్యానికి, అందానికి.. సెక్సీ స్పినాచ్ స్మూతీ..

10 December 2022, 7:15 IST

google News
    • Sexy Spinach Smoothie Recipe : ప్రోటీన్ మన శరీరానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. ప్రోటీన్ తమ డైట్​లో చేర్చుకోవాలి అనుకునేవారు చికెన్​ను ఎక్కువగా తీసుకుంటారు. అయితే వెజ్ వాళ్లు తమ డైట్​లో ప్రోటీన్​ తీసుకోవాలంటే.. ఈ స్మూతీ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. దీంతో కాకుండా దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు.
సెక్సీ స్పినాచ్ స్మూతీ
సెక్సీ స్పినాచ్ స్మూతీ

సెక్సీ స్పినాచ్ స్మూతీ

Sexy Spinach Smoothie Recipe : ఆరోగ్యానికి మేలు చేసే బ్రేక్​ఫాస్ట్​తో రోజును ప్రారంభిస్తే ఎంత మంచిది. అంతేకాకుండా ఈ స్మూతీ మీ చర్మానికి, జుట్టుకు మంచి సంరక్షణ ఇస్తుంది. దీనిని డైలీ తీసుకోవడం వల్ల మీ స్కిన్ క్లియర్ అవుతుంది. మీ శరీరీరం డిటాక్స్ అవుతుంది. జుట్టు రాలడం సమస్య కచ్చితంగా కంట్రోల్ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ స్మూతీ ఏంటి అనుకుంటున్నారా? అదే సెక్సీ స్పినాచ్ స్మూతీ. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పాలకూర - 1/2 కప్పు

* ద్రాక్ష - 1/2 కప్పు

* కీరదోసకాయ - 1/2 కప్పు

* నీరు - 1 కప్పు

* పుదీనాన - 1/2 కప్పు

* చియా సీడ్స్ - 2 స్పూన్స్ (నానబెట్టినవి)

తయారీ విధానం

కీరదోస ముక్కలు, ద్రాక్ష, పుదీనా, పాల కూరను బ్లెండర్​లో వేసి మిక్స్ చేయండి. దానిలో నీరు పోసి.. మరోసారి స్మూతీలాగా వచ్చేవరకు బ్లెండ్ చేయండి. దీనిని ఓ గ్లాసులో తీసుకుని.. చియాసీడ్స్​తో సర్వ్ చేయండి. ఇది మీ గట్ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మీ చర్మానికి, మీ జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది. రోజూ ఉదయాన్నే తీసుకుంటే మీరు మెరుగైన ఫలితాలు పొందుతారు.

టాపిక్

తదుపరి వ్యాసం