తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Instant Set Dosa Recipe : మినపప్పు, బియ్యం లేకుండా.. ఇన్‌స్టంట్ సెట్ దోశలను ఇలా చేసేయండి..

Instant Set Dosa Recipe : మినపప్పు, బియ్యం లేకుండా.. ఇన్‌స్టంట్ సెట్ దోశలను ఇలా చేసేయండి..

07 December 2022, 7:00 IST

    • Instant Set Dosa Recipe : దోశలు తినాలంటే.. ముందు రోజు నుంచే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. కానీ.. ఉదయాన్నే లేచి ఇన్‌స్టంట్ సెట్ దోశలు తినాలంటే మాత్రం కేవలం కొద్ది నిముషాల్లోనే దోశ పిండి తయారు చేసుకుని.. వేడి వేడి దోశలు వేసుకుని లాగించేయవచ్చు.
ఇన్‌స్టంట్ సెట్ దోశలు
ఇన్‌స్టంట్ సెట్ దోశలు

ఇన్‌స్టంట్ సెట్ దోశలు

Instant Set Dosa Recipe : మనం దోశలు వేసుకోవాలంటే మినపప్పు, బియ్యం ఉపయోగించి చేస్తాము. అయితే వీటిని చేయడానికి కాస్త ఎక్కువ ప్రాసెస్ పడుతుంది. అయితే మీరు దోశ పిండి తయారు చేయనప్పుడు.. మీకు దోశలు తినాలనిపిస్తే.. ఇంట్లోనే చక్కగా ఇన్‌స్టంట్ సెట్ దోశలు తినవచ్చు. అదేలా అనుకుంటున్నారా? అయితే మీరు ఇన్‌స్టంట్ సెట్ దోశల రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

Weight Loss Tips : బరువు తగ్గడానికి అల్పాహారం, రాత్రి భోజనం ఎంత ముఖ్యమో తెలుసుకోండి..

Chanakya Niti On Women : ఈ 5 గుణాలున్న స్త్రీని పెళ్లి చేసుకుంటే పురుషుల జీవితం స్వర్గమే

కావాల్సిన పదార్థాలు

* పోహా - 1 కప్పు

* రవ్వ - 1 కప్పు

* ఉప్పు - తగినంత

* ఫ్రూట్స్ సాల్ట్ - తగినంత

* ఆయిల్ - అవసరం మేరకు

* పెరుగు - పావు కప్పు

ఇన్‌స్టంట్ సెట్ దోశ తయారీ విధానం

ముందుగా రవ్వ, పోహా (నానబెట్టినది), పెరుగు, ఉప్పు వేసి.. మిక్సీలో వేసి పిండి చేయాలి. దానికి కొంచెం నీరు కలిపి.. మెత్తగా పిండి అయ్యేవరకు బ్లెండ్ చేయాలి. అంతే దోశ పిండి రెడీ. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి... నూనె వేసి వేడిచేయండి. దానిపై కొద్దిగా పిండి వేసి..దోశలను వేసుకుని ఒకవైపు మాత్రమే కాల్చండి. అంతే వేడి వేడి సెట్ దోశ రెడీ. మీకు ఇష్టమైన చట్నీతో దీనిని హ్యాపీగా లాగించేయవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం