తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kidney Health In Kids: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి, ఇవన్నీ కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు

Kidney Health in kids: పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి, ఇవన్నీ కిడ్నీ వ్యాధి ప్రారంభ లక్షణాలు

Haritha Chappa HT Telugu

01 October 2024, 8:00 IST

google News
  • Kidney Health in kids: ఈ రోజుల్లో కిడ్నీ వ్యాధులు పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు కొన్ని ప్రారంభ లక్షణాల గురించి తెలుసుకోవాలి. వారి పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలి.

కిడ్నీల వ్యాధిలో లక్షణాలు
కిడ్నీల వ్యాధిలో లక్షణాలు (Shutterstock)

కిడ్నీల వ్యాధిలో లక్షణాలు

మూత్రపిండాలు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించి, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఆరోగ్యకరమైన శరీరానికి, మూత్రపిండాలు హెల్తీగా  ఉండటం చాలా ముఖ్యం.  కానీ నేటి మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కిడ్నీ సమస్యలు ఎక్కువగా పెరిగాయి. కిడ్నీ సమస్యలు పెద్దవారిలోనే కాదు చిన్న పిల్లల్లో కూడా వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు పిల్లలలో మూత్రపిండాల వ్యాధి లక్షణాలను తెలుసుకోవాలి. తద్వారా వారిని సరైన సమయంలో గుర్తించవచ్చు.  అవసరమైన చికిత్స చేయవచ్చు. ఈ లక్షణాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 

పిల్లల్లో కనిపించే లక్షణాలు

పిల్లల ముఖంలో అకస్మాత్తుగా వాపు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధికి సంబంధించిన లక్షణం కావచ్చు. పిల్లలకు మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు, వారి ముఖంపై, ముఖ్యంగా కళ్ళ దగ్గర వాపు ఉంటుంది.  మీ పిల్లలకి కూడా ఈ లక్షణాలు ఉంటే, ఖచ్చితంగా వైద్యుడికి చూపించండి.

పిల్లలకి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది ఉంటే, అది మూత్రపిండాల వ్యాధి లక్షణం కూడా కావచ్చు. టాయిలెట్ చేసేటప్పుడు నొప్పి లేదా మంటను వస్తుందని పిల్లలు చెప్పినా, మూత్రం రంగులో మార్పు వచ్చినా… ఇవన్నీ మూత్రపిండాల వ్యాధికి సంకేతం కావచ్చు. మరుగుదొడ్డికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మంచి వైద్యుడిని సంప్రదించాలి.

పదే పదే టాయిలెట్

పిల్లలు పదేపదే టాయిలెట్‌కు వస్తే అది కూడా కిడ్నీ సమస్యలకు సంకేతం కావచ్చు. అయితే కొన్నిసార్లు పిల్లలు ఎక్కువ నీరు తాగినా, వాతావరణం చల్లగా ఉన్నా రోజుకు చాలాసార్లు టాయిలెట్ కు వెళ్తారు. అయితే పిల్లలు వరుసగా చాలా రోజులు పదేపదే టాయిలెట్ కు వెళ్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

మీ పిల్లలు తరచుగా కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తే, అది మూత్రపిండాల సమస్యలకు సంకేతం కూడా కావచ్చు. పిల్లవాడు ఎల్లప్పుడూ కడుపు నొప్పితో ఫిర్యాదు చేస్తే, ఆహారం తినడానికి కూడా ఇష్టపడకపోతే, ఈ లక్షణాలన్నీ మూత్రపిండాల వ్యాధితో సంబంధం కలిగి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి వెంటనే వెద్యులకు చూపించడం చాలా ముఖ్యం. 

ఎల్లప్పుడూ అలసట

ఒక పిల్లవాడు రోజంతా అలసిపోయినట్లు అనిపిస్తే, కొంచెం పరిగెత్తిన తర్వాత వెంటనే అలసిపోతే అప్పుడు కూడా పిల్లవాడు ఒకసారి వైద్యుడికి చూపించాలి. మీ పిల్లవాడు రోజంతా నీరసంగా ఉన్నా కూడా అతడికి మూత్రపిండ వ్యాధి ఉన్నట్టు అనుమానించాలి. కాళ్లు, పాదాల్లో నీరు చేరి ఉబ్బినట్టు అనిపించినా కూడా మూత్రపిండాల వ్యాధి ఉందేమో ఓసారి చెక్ చేసుకోవాలి. 

పిల్లలకు తాజా పండ్లు ఎక్కువగా తినిపించాలి. కూరగాయలతో వండిన కూరలను తినిపించాలి. పాల ఆధారిత ఆహారాలను కూడా పెట్టాలి.  నిమ్మరసం, నారింజ రసం అధికంగా తినిపించాలి. ఉప్పును తగ్గించాలి. చాక్లెట్, పాలకూర, బీట్ రూట్, టీ వంటివి ఇవ్వకూడదు. 

 

టాపిక్

తదుపరి వ్యాసం