తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : కళ్లు మూసి కలల కనండి.. కళ్లు తెరిచి వాటిని నిజం చేసుకోండి..

Sunday Motivation : కళ్లు మూసి కలల కనండి.. కళ్లు తెరిచి వాటిని నిజం చేసుకోండి..

30 October 2022, 6:00 IST

google News
    • Sunday Motivation : కలలు కళ్లు మూసి కనాలి.. ఆ కలలను కళ్లు తెరిచి నిజం చేసుకోవాలి. కళ్లు తెరిచి కూడా కలల కంటాము అంటే అది కరెక్ట్ కాదు. అలా అయితే ఎప్పటికీ వాటిని నిజం చేసుకోలేము. కలలు కన్నంత ఈజీ కాదు.. కళ్లు తెరిచి వాటిని నిజం చేసుకోవడం.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : కలలు అంటే ఏదో ర్యాండమ్​గా వచ్చి వెళ్లిపోయేవి కాదు. మనం ఏమి కావాలనుకుంటున్నామో.. ఏమి కోరుకుంటున్నామో.. మనకు ఏది అవసరం అని భావిస్తున్నామో అవి కలలు. ప్రశాంతంగా ఓ ప్రదేశంలో కూర్చొని.. లేదా పడుకుని.. మనం ఏమి కావాలనుకుంటున్నామో.. వాటికోసం మనం ఎలా కృషి చేయాలో ఆలోచిస్తూ.. వాటికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ.. మనల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి.. పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఎలాంటి అవాంతరాలు వస్తాయి అనే వాటి గురించి ఆలోచించడమే కలలు కనడం.

ఈ కలలు కనే ప్రాసెస్​లో మనం కళ్లు మూసుకుని.. లోకాన్ని చూడకుండా.. మనలోని శక్తి, లోపాలను చూసుకుంటాము. మన మీద మనకు ఓ అంచనా వచ్చిన తర్వాత.. కళ్లు తెరిచి వాటిని నిజం చేసుకోవడానకి కృషి చేయాలి. కళ్లు మూసుకుని ఉన్నప్పుడు మనం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోము. కళ్లు తెరిచే సరికి.. చుట్టూ ఉన్న లోకం.. ఇతరుల వల్ల కలిగే ఇబ్బందులు మన కళ్లకు ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు మనం ఇంకెలా ముందుకు వెళ్లాలో.. తెలుసుకోగలగాలి.

మన గోల్​ని క్లియర్​గా చూడాలంటే కళ్లు తెరవాల్సిందే. కళ్లు మూసుకుని కలలు కంటే అది ఎప్పటికీ మన దగ్గరకు చేరదు. కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలి. జీవితం ఇంట్రెస్టింగ్​గా ఉండాలంటే.. మీరు కలలు కనడం చాలా ముఖ్యం. వాటిని నిజం చేసేందుకు మీరు చేసే కృషి.. మీకు మరిన్ని ఛాలెంజ్​లు ఇస్తుంది. మీ జీవితాన్ని మరింత ఇంట్రెస్టింగ్​గా చేస్తుంది. ఇది మీరు విజయాన్ని సాధించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కలలు కనడం అనేది మీ పాత్రను బలపరుస్తుంది. కాబట్టి కలలు కనడం ఆపకుండా ఉండటమే మీరు చేయగలిగే గొప్పదనం. మీరు కలలు కనడం మానేశారు అంటే.. అది మీ జీవితంలో చివరి రోజు అవుతుంది.

కలలు కనడం వల్ల మీకు మేలు జరగదు. వాటిని నిజం చేసుకోవడంలోనే మీకు మేలు జరుగుతుంది. దానికోసం మీరు అంకితాభావాన్ని కలిగి ఉండాలి. మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి మీకు సహాయపడే కచ్చితమైన ప్రణాళికను రూపొందించుకోవాలి. మీరు చాలా కష్టపడాలి. లేకపోతే మీరు మీ జీవితంలో విఫలం కావచ్చు. కలలు అందరూ కంటారు. కానీ.. వాటిని నిజం చేసుకోగలిగే వారే ఇతరులకు ఆదర్శం అవుతారు.

తదుపరి వ్యాసం