Monday Quote : మీ లోపాలను గుర్తించండి.. వాటిని మీ సామర్థ్యాలతో ప్రొటెక్ట్ చేయండి-monday motivation on sometimes you dont realize your own strength until someone tries to take advantage of your weakness ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Monday Motivation On Sometimes You Dont Realize Your Own Strength Until Someone Tries To Take Advantage Of Your Weakness

Monday Quote : మీ లోపాలను గుర్తించండి.. వాటిని మీ సామర్థ్యాలతో ప్రొటెక్ట్ చేయండి

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 18, 2022 09:06 AM IST

కొన్నిసార్లు మన బలం, బలహీనతలు ఇవి అని తెలిసినా.. మనం పెద్దగా వాటిని పట్టించుకోము. అవి ఎప్పుడూ బయటకి వస్తాయంటే.. మన లోపాలను చూపెడుతూ.. వేరొకరు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు లేదా తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మన బలం గుర్తించి.. పోరాడతాం.

కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

Monday Motivation : మనకు కష్టాలు వచ్చినప్పుడే మనలోని సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఎందుకంటే అప్పుడు కూడా ఏమి చేతకానట్లు కూర్చుంటే.. మనుగడ ప్రశ్నగా మారుతుంది. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయంటే.. మనం లోపాలు ఎదుటివారు గుర్తించినప్పుడు. అప్పటివరకు మనతో మంచిగా ఉన్నవారు.. తమ స్వార్థం కోసం మిమ్మల్నే మోసగించడం ప్రారంభిస్తారు. అప్పుడు కూడా మీరు మేల్కోకపోతే.. ఇబ్బందులను కొని తెచ్చుకునేవారు అవుతారు.

మన బలహీనతలు మరొకరు సద్వినియోగం చేసుకుంటున్నారంటే అర్థం.. వారు మీతో ఇంతకుముందు చాలా సమయం వెచ్చించిన వారు అయినా ఉండాలి. లేదా మిమ్మల్ని చాలాకాలం నుంచి అబ్జర్వ్ చేస్తున్నవారు అయినా ఉండాలి. అంటే మీతో క్లోజ్​గా ఉంటూ.. మేమున్నా అని ధైర్యం ఇస్తున్నట్లు నటిస్తూ.. వారు మీ లోపాలను, భయాలను తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు మీ బలాలను గుర్తించరు. కాబట్టి.. వారి మీ లోపాలతో అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. మిమ్మల్ని కొన్ని సమస్యల్లో పడేలా చేస్తారు. కానీ మీ సామార్థ్యాలు వారికి తెలియదు కాబట్టి.. వాటిని ఎదుర్కోవడానికి మీరు స్వాయాశక్తులా ప్రయత్నిస్తారు.

ఎదుటివారు మీ బలాన్ని గుర్తించకపోయినా పర్లేదు కానీ.. మీ బలహీనతలు గుర్తించేలా మాత్రం చేయకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని సమస్యల్లో పడేస్తారు. ఒక్కోసారి మీరు ఆ సమస్యలనుంచి బయటకు రాలేకపోవచ్చు. కాబట్టి ఎదుటివారితో మీ లోపాలను పంచుకునే ముందు ఓసారి ఆలోచించండి. మీరు ఎంత బాధలో ఉన్నా.. ఎదుటివారికి మీ లోపాన్ని చెప్పేముందు ఆలోచించుకోండి. ఎందుకంటే మీ లోపాలను ఎదుటివారికి చెప్పడమే మీరు చేసే పెద్ద తప్పు.

ఉద్యోగంలో లేదా ఏదైనా ప్రాజెక్టులో మీరు ఆ పని చేయలేరని మీకు అనిపించినప్పుడు మీరు వేరే విధానాన్ని ఎన్నుకోండి. అంతేకానీ నేను ఇది చేయలేకపోతున్నాను అని ఎదుటివారితో చెప్పకండి. ఎందుకంటే వారు దానిని అడ్వాంటేజ్ తీసుకుని.. మీవల్లే అది లేట్​ అవుతుందని తప్పు మొత్తం మీ మీదకు తోసేస్తారు. మీ సొంత శక్తిని గుర్తించండి. అది మీవల్ల కాదు అని ఇన్నిరోజులు ఆగిపోయిన పనులను కూడా చేస్తుంది. చుట్టూ ఉన్నవారు ఏదొక రకంగా ఇతరుల నుంచి ప్రయోజనాలు తీసుకుంటారు. మనం వారికి ఎరగా మారకుండా చూసుకోవాలి.

మనందరికీ బలహీనతలతో పాటు కొన్ని బలాలు ఉన్నాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. కష్టాలు మన ముందున్నట్లు అనిపించినప్పుడు మనం మన ఉత్తమమైనదాన్ని ఎంచుకుని వాటిని ఎదుర్కోవాలి. మీ సామర్థ్యాలపై మీరు నమ్మకం ఉంచండి. అప్పుడు మాత్రమే జీవితంలో ఏదీ మిమ్మల్ని వెనక్కి లాగదు. మీ బలహీనతలను అంగీకరించడం నేర్చుకోండి. అదే సమయంలో మీ బలాలపై విశ్వాసం కలిగి ఉండండి. మీరు అందరి కంటే మెరుగైన వారని తెలుసుకోండి. మీకు కావలసిందల్లా మిమ్మల్ని మీరు విశ్వసించడమే.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్