తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tap Cleaning: కొళాయిలపై మొండి మరకలు పోవడం లేదా? ఇలా చిన్న చిట్కాలతో వాటిని సులువుగా మెరిపించేయండి

Tap Cleaning: కొళాయిలపై మొండి మరకలు పోవడం లేదా? ఇలా చిన్న చిట్కాలతో వాటిని సులువుగా మెరిపించేయండి

Haritha Chappa HT Telugu

16 September 2024, 16:30 IST

google News
  • Tap Cleaning: కుళాయిలు కొన్నాళ్లు వాడాక మొంటి మరకలు పడతాయి. సులభమైన చిట్కాల ద్వారా వాటిపై ఉన్న మరకలు పొగొట్టవచ్చు. కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం వల్ల నీటి కుళాయిలను మెరిపించవచ్చు.

నీటి కుళాయి క్లీనింగ్ టిప్స్
నీటి కుళాయి క్లీనింగ్ టిప్స్ (shutterstock)

నీటి కుళాయి క్లీనింగ్ టిప్స్

ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లోని వారి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ప్రతి వారం లేదా నెలకోసారైనా వీటిని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లు రొటీన్ క్లీనింగ్ లో భాగంగా అన్నీ శుభ్రపరుస్తారు కానీ, కొళాయిలు క్లీన్ చేయరు. నిజానికి వీటిని కచ్చితంగా శుభ్రపరచుకోవాలి. కుళాయిలను ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తారు కాబట్టి మొండి మరకలు పట్టేస్తాయి.

బాత్రూం కుళాయిలను శుభ్రం చేసేటప్పుడు ఇంట్లోని మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. నీటి కుళాయిలపై మొండి తుప్పు, ఉప్పు నీటి మరకలు అంత సులువుగా పోవు. రసాయనాలున్న లిక్విడ్స్ వాడిన ఉపయోగం లేకపోతే మీరు వంటించి చిట్కాల ద్వారానే కుళాయిలను క్లీన్ చేయవచ్చు. పండుగల సమయంలో ఇంటిని క్లీన్ చేసినప్పుడు కుళాయిలను ఎంత సులువుగా శుభ్రపరుచకోవచ్చో తెలుసుకోండి. ఈ వంటింటి చిట్కాలను పాటించడం వల్ల నీటి కుళాయిలు చాలా సులభంగా శుభ్రపడటమే కాకుండా, కోల్పోయిన కాంతి కూడా తిరిగి వస్తుంది.

నిమ్మకాయ లేదా వెనిగర్

కుళాయిపై ఉప్పు నీటికి చెందిన మొండి మరకలను తొలగించడానికి మీరు వెనిగర్, నిమ్మకాయను ఉపయోగించవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, మీరు కుళాయిపై నిమ్మరసం లేదా వెనిగర్ స్ప్రే చేయాలి. సుమారు 20 నిమిషాలు అలా వదిలేయండి. దీని తరువాత, బ్రష్ సహాయంతో కుళాయిని రుద్దడం ద్వారా శుభ్రం చేయండి. ఆ తరువాత కుళాయిని నీటితో కడిగి, పొడి బట్టతో బాగా తుడవాలి. కావాలనుకుంటే నిమ్మ, వెనిగర్ ను కూడా సమాన పరిమాణంలో వాడుకోవచ్చు. ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల కుళాయి తెల్లగా మెరిసిపోతుంది.

టొమాటో సాస్

టోమాటో కెచప్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. దీనిలో ఉండే గుణాలు మరకలను పొగడొతాయి. కుళాయిపై నీటి మరకలను శుభ్రం చేయడానికి టమోటా సాస్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ రెమెడీ చేయడానికి, మూడు టీస్పూన్ల టమోటా సాస్ తీసుకుని రెండు మూడు సార్లు కుళాయికి పట్టించండి. ఆ తర్వాత బ్రష్ తీసుకుని బాగా రుద్దండి. నీళ్లు పోసి బాగా కడగండి. తరవుాత పొడి బట్టతో శుభ్రం చేయాలి.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో క్లీనింగ్ గుణాలు ఎక్కువ. ట్యాప్ పై మరకలను శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడా సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ రెమెడీ చేయడానికి, రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో సగం నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ట్యాప్ కు రుద్ది ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత కుళాయిని స్క్రబ్ సాయంతో రుద్దాలి. ఆ తర్వాత కుళాయిని నీటితో కడిగి పొడి కాటన్ వస్త్రంతో తుడవాలి. అంతే కుళాయిలపై ఉన్న మొండి మరకలు తొలగిపోతాయి.

పైన చెప్పిన వంటింటి చిట్కాలను పాటించి సింగ్ లు, ప్లాట్ ఫారమ్ లు కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒకసారి వాటితో ప్రయత్నించి చూడండి.

తదుపరి వ్యాసం