TechNews|హైదరాబాద్‌లో 'స్ప్రింక్లర్'.. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉపాధి అవకాశాలు
28 March 2022, 10:38 IST
- SaaS కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ (CXM) ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధిపరచడం ప్రధాన లక్ష్యంగా స్ప్రింక్లర్ టెక్నాలజీ కంపెనీ సేవలు అందిస్తోంది. ఈ కంపెనీ ఇప్పుడు తమ కార్యాలయాన్నీ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
User Experience Matters
Hyderabad | అమెరికాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ స్ప్రింక్లర్ దాదాపు 1000 మంది ఐటీ నిపుణులతో ఒక డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. SaaS కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ (CXM) ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధిపరచడం ప్రధాన లక్ష్యంగా స్ప్రింక్లర్ టెక్నాలజీ సేవలు అందిస్తోంది.
టెక్ ఎగ్జిక్యూటివ్ రేగీ థామస్ 2009లో స్ప్రింక్లర్ టెక్ సంస్థను స్థాపించారు. గత ఏడాది జూన్ 23న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ కంపెనీని జాబితా చేయడం జరిగింది. సోషల్ మీడియా మార్కెటింగ్, సోషల్ అడ్వర్టైజింగ్, కంటెంట్ మేనేజ్‌మెంట్, కొలాబరేషన్, ఎంప్లాయ్ అడ్వకేసీ, కస్టమర్ కేర్, సోషల్ మీడియా రీసెర్చ్, సోషల్ మీడియా మానిటరింగ్ కోసం వివిధ అప్లికేషన్‌లను మిళితం చేసే సాఫ్ట్‌వేర్‌ను స్ప్రింక్లర్ కంపెనీ అభివృద్ధి చేసింది.
స్ప్రింక్లర్ కంపెనీకి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా-పసిఫిక్ ప్రాంతాలలో విస్తరించి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 3,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
స్ప్రింక్లర్ ఏర్పాటయితే నగరంలో CXM సెక్టార్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. హైదరాబాద్‌లో తాము ఏర్పాటు చేయబోయే డెవలప్‌మెంట్ సెంటర్‌లో ప్రారంభంలో 200 మంది టెకీలను నియమించుకుంటాం అని, ఆ తర్వాత వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో టెక్కీల సంఖ్యను 1,000కి పెంచాలని కంపెనీ యోచిస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు స్ప్రింక్లర్ యాజమాన్యం తెలిపింది.
మంత్రి కేటీఆర్ ఇటీవల యూఎస్ లో పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ ఎకోసిస్టమ్‌ను కేటీఆర్ హైలైట్ చేశారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
టాపిక్