తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Global Parents Day 2022 | షరతుల్లేని ప్రేమకు నిజమైన స్వరూపమే తల్లిదండ్రులు

Global Parents Day 2022 | షరతుల్లేని ప్రేమకు నిజమైన స్వరూపమే తల్లిదండ్రులు

HT Telugu Desk HT Telugu

01 June 2022, 13:00 IST

google News
    • ప్రతి సంవత్సరం జూన్​ 1వ తేదీన గ్లోబల్ పేరెంట్స్ డే జరుపుకుంటారు. 1994లో బిల్​క్లింటన్ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కానీ 2012లో ఐక్యరాజ్యసమితి.. జూన్ 1ని గ్లోబల్ పేరెంట్స్​ డేగా ప్రకటించారు. తల్లిదండ్రులు మనకు చేసిన త్యాగాలను గుర్తిస్తూ.. వారికి మన ప్రేమను పంచాలని తెలిపే రోజుగా దీనిని పాటిస్తారు.
తల్లిదండ్రులకు మీ ప్రేమను పంచండి…
తల్లిదండ్రులకు మీ ప్రేమను పంచండి…

తల్లిదండ్రులకు మీ ప్రేమను పంచండి…

Global Parents Day 2022 | సమస్యలు జీవితంలో ఒక భాగం. కానీ ఆ సమస్యలు పిల్లలకు తెలియకూడదని.. చాలా మంది తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. ఆ బాధలను, కష్టాలను పిల్లలముందు ప్రదర్శించకుండా జాగ్రత్త పడతారు. అందుకే చాలామంది పిల్లలు తమ బాల్యంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ.. సంతోషంగా, హాయిగా గడిపారు. కానీ కొందరు పిల్లలు చిన్న వయస్సులోనే ఇంటి బాధ్యతలు స్వీకరించి ఉంటారు. కానీ పిల్లలకు కష్టాలు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులకు.. ఈ విషయంలో మీరు వారికి థ్యాంక్స్ కచ్చితంగా చెప్పాలి. నిస్వార్థమైన ప్రేమను పంచిన తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పడం కోసమే గ్లోబల్ పేరెంట్స్ డేని నిర్వహిస్తారు.

మీపై శ్రద్ధ చూపినందుకు..

పిల్లలు పెరుగుతున్న సంవత్సరాల్లో.. తల్లిదండ్రులు బిజీగా ఉంటే.. వారికి సరైన సమయం ఇవ్వడంలో కచ్చితంగా విఫలమైతారు. అలాంటి సమయంలో పిల్లలు నిరాశ, ఒంటరితనాన్ని ఎదుర్కొంటారు. కొందరు పిల్లలు చెడు సహవాసానికి కూడా మొగ్గు చూపుతారు. కానీ మీ తల్లిదండ్రులు మీ పట్ల శ్రద్ధ వహించి.. అన్నింటినీ బాగా బ్యాలెన్స్ చేసుకుంటే వారికి థ్యాంక్స చెప్పండి. వారిని ఆదర్శంగా తీసుకోండి.

ఎల్లప్పుడూ మీకు మద్దతునిస్తే..

మీరు చెప్పేది విని, మార్గనిర్దేశం చేసే, మీ జీవితంలో మీరు తీసుకునే నిర్ణయంలో మీకు మద్దతు ఇచ్చే తల్లిదండ్రులు మీకు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. మీ జీవితం కఠినంగా ఉన్నప్పుడు, మీరు విచ్ఛిన్నం అవుతున్నట్లు భావించినప్పుడు మీ పేరెంట్సే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ కలలు ఎంత పెద్దవి అయినప్పటికీ.. మీ తల్లిదండ్రులు అడుగడుగునా మీకు అండగా ఉంటే.. వారికి మీ ప్రేమను తెలియజేయండి.

మీరు గమనించినా.. గమనించకపోయినా.. మీ తల్లిదండ్రులు మీకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కొన్ని విలువైన జీవిత పాఠాలను అందించే ఉంటారు. మీరు అలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు మీకు అవి అర్థం అవుతాయి. అప్పుడు మీరు వారి సలహా కోసం వారి దగ్గరికి వెళ్తారు. అంతేకాకుండా ఆ సమస్యలను అంత ప్రశాంతంగా ఎలా ఎదుర్కున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

తల్లిదండ్రులు షరతులు లేని ప్రేమకు నిజమైన ప్రతిరూపం. మీ చిన్నతనంలో వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. పెద్దయ్యాక ప్రేమిస్తారు. వారు నిరంతరం మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. అలాంటి స్వచ్ఛమైన ప్రేమ మనకు ఇంక ఎక్కడా దొరకదనే చెప్పాలి. అలాంటి ప్రేమను పంచేవారిని.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పిల్లలదే. పేరెంట్స్​ని ఎంత ప్రేమగా చూస్తే.. మీరు సమాజంలో అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారు.

తదుపరి వ్యాసం