Shilpa Shetty Yoga: ఉద్యోగుల కోసం శిల్పాశెట్టి వీల్ చైర్ యోగా..మీరు ట్రై చేయండి!
28 August 2022, 21:32 IST
- Shilpa Shetty Yog Tips: ఆఫీస్ పనులతో రోజంతా బిజీగా గడిపే ఉద్యోగాలు ఫిట్‌నెస్‌పై శ్రద్ద వహించారు. దీంతో ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం పడుతుంది. దీంతో ఉద్యోగుల కోసం శిల్పాశెట్టి వీల్ చైర్ యోగాను ప్రపోజ్ చేశారు. ఇది ఆఫీసుకు వెళ్లేవారికి ప్రభావవంతంగా ఉంటుందని వివరిస్తున్నారు.
shilpa shetty
బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్ సామర్థ్యమేంటో అందరికి తెలిసిందే. 50 ఏళ్ళకు దగ్గరగా ఉన్న శిల్పాశెట్టి చూడడానికి మాత్రం చాలా యంగ్ లుక్ కనిపిస్తారు. ఆమె ఇంత నాజుకుగా ఉండానికి ప్రదాన కారణం ప్రతి రోజు యోగా సాధన. చాలా మంది శిల్ప యోగా టిప్స్ ఫాలో అవుతుంటారు. ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా బాడీ రిలాక్సేషన్‌కు సంబంధించిన యోగా టిప్స్ ఇస్తుంటారు. శిల్పా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో 26 మిలియన్ల యాక్టివ్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. రీసెంట్‌గా వీల్ చైర్ పై కూర్చొని యోగాసనాలు వేశారు. ఈ అసనాల వల్ల ఆఫీస్ పనుల్లో ఎక్కువ సమయం ఛైర్‌కే పరిమితమైనవారికి చాలా బాగా ఉపయోగపడుతాయి. మరి ఆ ఆసనాల గురించి తెలుసుకుందాం.
తడసానా (పర్వత భంగిమ):
ఈ ఆసనంలో చేతులు పైకి ఎత్తి నిటారుగా నిలబడాలి. తర్వాత స్లోగా మడమలు పైకెత్తి మునికాళ్లపై సాధ్యమైనంత సేపు నిలబబడాలి. తర్వాత చేతులను మడమలను క్రిందికి దింపాలి. తర్వాత మోకాళ్లు వంగకుండా వునికాళ్లతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. కళ్ళు మూసుకోండి, లోతైన శ్వాస తీసుకోండి. ఇప్పుడు చివరి భంగిమను 20-30 సెకన్ల పాటు పట్టుకోండి, ఆ తర్వాత విశ్రాంతి తీసుకోండి.
పార్శ్వకోనాసనం
ఈ భంగిమలో పాదాలను ఒక చేత్తో ఎత్తి.. మరో చేత్తో ఆకాశం వైపు ఉంచినట్లుగా ఉంటుంది. కుర్చీపై ఈ ఆసనం వేయడానికి, రెండు చేతులను విస్తరించండి. ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఎడమ చేతిని పైకి కదిపి కుడి చేతి వైపు నుండి ఆకాశం వైపు చూసేందుకు ప్రయత్నించండి.
భరద్వాజాసన
ఈ ఆసనం చేసేటప్పుడు, వెన్నెముకపై దృష్టి పెట్టాలి. దీని కోసం, నేరుగా కుర్చీపై కూర్చోండి. రెండు అరచేతులను ముందుకు ఉంచాలి. ఇప్పుడు లోతైన శ్వాస తీసుకోండి. తర్వాత వెన్నెముకపై దృష్టి పెట్టండి. పీల్చేటప్పుడు, పై మొండెం వీలైనంత తిప్పండి. రిలాక్స్ అవ్వండి, ఈ ప్రక్రియ చేస్తున్నప్పుడు, వెన్నెముకను కొద్దిగా వంచి, ఇప్పుడు మళ్లీ రిలాక్స్ అవ్వండి.