తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fitness Tips:జిమ్‌లో స్టామినా లేక ఇబ్బంది పడుతున్నారా?అయితే ఈ ఆహారాలు తీసుకోండి!

Fitness Tips:జిమ్‌లో స్టామినా లేక ఇబ్బంది పడుతున్నారా?అయితే ఈ ఆహారాలు తీసుకోండి!

HT Telugu Desk HT Telugu

25 August 2022, 21:59 IST

    •  Food For Stamina: ఫిట్‌నెస్ కోసం చాలా మంది జిమ్‌కి వెళుతుంటారు. అయితే శరీరంలో స్టామినా లేకపోతే, జీమ్ చేసేటప్పుడు, ఆయాసం వస్తుంటుంది. దీంతో మధ్యలోనే జిమ్ వదిలేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో,  కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా స్టామినా పెంచుకోవచ్చు. 
gym
gym

gym

చాలా మంది ఫిట్‌గా ఉండడం కోసం జిమ్‌కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటారు. ఆరంభంలో ఉత్సాహంగా జిమ్‌కు వెళ్ళినా.. కొన్ని రోజుల తర్వాత ఆస్తకి తగ్గిపోతుంది. దీనికి కారణం స్టామినా లేకపోవడం. శరీరంలో ఎటువంటి సత్తువ ఉండకుండా వ్యాయామం చేస్తున్నప్పుడు 15 నుండి 20 నిమిషాల వ్యాయామం తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. కాబట్టి కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా స్టామినాను పెంచుకోవచ్చు. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

స్టామినా పెంచడానికి ఈ ఆహారాలను తినండి

బాదం-

బాదం పప్పును పోషకాల నిధిగా పరిగణిస్తారు. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల మీ శరీరం స్టామినా పెరుగుతుంది. మరోవైపు, బాదంపప్పు తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి, అంతే కాకుండా రక్తంలో చక్కెర కూడా అదుపులో ఉంటుంది.

అరటిపండు -

పండ్లలో ఎక్కువ మంది ఇష్టపడేది అరటిపండు. అరటి పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్, సహజ చక్కెర శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్ A, విటమిన్ B అరటి పండులో ఎక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి ఎక్కువ కాలం శక్తిని ఇస్తుంది.

కాఫీ -

శరీర అలసటను తొలగించడానికి కాఫీ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది కాఫీ తీసుకోవడం వల్ల స్టామినా కూడా పెరుగుతుంది అనేక పరిశోధనల్లో తెలింది. కాఫీ తీసుకోవడం ద్వారా, అడ్రిలిన్ హార్మోన్ శరీరం నుండి విడుదలవుతుంది, ఇది కండరాలకు రక్తాన్ని వేగంగా పంప్ చేయడంలో సహాయపడుతుంది కాబట్టి, జిమ్‌కి వెళ్లేవారు రోజూ 2 సార్లు కాఫీ తాగాలి. అది పరిమితంగానే.

ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కేవలం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ఇది HT Times Telugu దీన్ని ధృవీకరించలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం