అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!-healthy eating when you have digestive problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Healthy Eating When You Have Digestive Problems

అజీర్తి సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి!

HT Telugu Desk HT Telugu
Aug 22, 2022 05:02 PM IST

digestive problem: చాలా మంది అజీర్తి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రోజు వారిగా తీసుకునే ఆహరం. అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

digestion food
digestion food

చాలా మందిని అజీర్తి సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. తిసుకునే ఆహారంలో సత్వగుణం లేకుంటే లేదా చేడు ఆహారపు అలవాట్లు వల్ల అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఇబ్బంది నుండి బయటపడాలంటే తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీకు కొన్ని నచ్చినప్పటికీ ఆ ఆహారాలకు దూరంగా ఉండాలి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల అజీర్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

రోజువారిగా తీసుకునే ఆహారంలో పెరుగు, పండ్లు, చియా గింజలు వంటివి తీసుకోవడం మంచిది. అలాగే, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే నివారించాల్సిన కొన్ని ఆహారాలను తెలుసుకుందాం.

వేయించిన ఆహారం : నూనె, వేయించిన ఆహారాలు యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంటను కలిగిస్తుంది. వేయించిన ఆహారం జీర్ణం కావడం చాలా కష్టం. ఫలితంగా ఆహారం జీర్ణ కావడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది గుండెల్లో మంటకు దారితీస్తుంది.

కెఫిన్ : మీరు జీర్ణక్రియ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే కెఫిన్ తీసుకోవడం మానుకోండి. ఇది ఆరోగ్యాన్ని పరిస్థితిని మరింతగా దిగజారుస్తుంది. కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలకు కారణం కావచ్చు. ఎందుకంటే ఇది జీర్ణశయాంతర చలనశీలతను పెంచుతుంది.

పాల ఉత్పత్తులు : ఆవు పాలతో తయారైన ఉత్పత్తులు యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతాయి. కాబట్టి అజీర్ణ సమస్యలతో బాధపడుతుంటే అటువంటి ఉత్పత్తులను తీసుకోకుండా ఉండటం మంచిది.

స్పైసీ ఫుడ్ : స్పైసీ ఫుడ్ అజీర్ణానికి ప్రధాన కారణాలలో ఒకటి. జీర్ణక్రియ సంబంధింత సమస్యలతో బాధపడుతున్నవారు దీనిని తీసుకోవడం వల్ల మీ పొట్ట ఉబ్బసనానికి కారణమవుతుంది . ఇది అజీర్ణం, గుండెల్లో మంటను కలిగిస్తుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి.

పై కథనం అధికారిక సమాచారం కాదు, ఇది కేవలం సాధారణ సమాచారం ఉంది.

జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

WhatsApp channel

సంబంధిత కథనం