తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smart Interior: సెలెబ్రిటీలు, ధనవంతుల ఇళ్లలో ఉండే లేటెస్ట్ వసతులివే.. మీరూ ఏర్పాటు చేయొచ్చు

Smart Interior: సెలెబ్రిటీలు, ధనవంతుల ఇళ్లలో ఉండే లేటెస్ట్ వసతులివే.. మీరూ ఏర్పాటు చేయొచ్చు

12 August 2024, 10:30 IST

google News
  • Smart Interior: మీ ఇంటికి ఫ్రెష్ లుక్, అనుభూతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ ఐదు స్మార్ట్ అప్ గ్రేడ్ లు స్టైల్, ఫంక్షనాలిటీ రెండింటినీ పెంచుతాయి. ధనవంతులు, సెలెబ్రిటీల ఇళ్లలో ఉండే ఫీచర్లు ఇవే.

స్మార్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్
స్మార్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్ (Freepik)

స్మార్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ టిప్స్

మీ ఇంట్లో మార్పులు చేయాలి అనుకుంటున్నారా? మీరు చేయబోయే మార్పులతో ఇంట్లో సౌకర్యం పెరగడంతో పాటూ మీ పనులు కూడా సులువవ్వాలి. వంటగదిని ఆధునీకరించాలి అనుకుంటున్నా.. సెక్యురిటీ పెంచాలనుకుంటున్నా.. అలంకరణను జోడించాలనుకుంటున్నా..కొన్ని టిప్స్ తెల్సుకోండి. మామూలుగా ధనవంతులు, పెద్ద సెలెబ్రిటీల ఇళ్లకే పరిమితమైన ఈ ఫీచర్లు ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని మనం కూడా మనిళ్లల్లో ఏర్పాటు చేసుకోవచ్చు.

1. కిచెన్ ఆర్గనైజర్లు:

వంటగది ఇంట్లో చాలా ముఖ్యమైన భాగం. కిచెన్‌లో స్టోరేజీ స్పేస్ పెంచడం చాలా ముఖ్యం. పుల్ అవుట్ ప్యాంట్రీ షెల్ఫులు, మాడ్యులర్ డ్రాయర్ ఇన్సర్ట్స్ లేటెస్ట్ కిచెన్ ఆర్గనైజర్లు. మసాలా ర్యాకులు, స్టాకింగ్ డబ్బాలు, మల్టీ స్టెప్ అల్మారాలు, కార్నర్ యూనిట్లు.. వంటి వినూత్న ఆర్గనైజర్లు కిచెన్ అందాన్ని, సౌకర్యాన్ని పెంచుతాయి.

2. స్మార్ట్ డిజిటల్ లాక్స్:

ఇంటి పునరుద్ధరణ విషయానికి వస్తే భద్రత కీలకమైన అంశం. స్మార్ట్ డిజిటల్ లాక్ లను ఇన్‌స్టాల్ చేయడం మీ ఇంటిని రక్షించడానికి గొప్ప మార్గం. ఈ తాళాలు అత్యున్నత భద్రతను అందించడమే కాకుండా కీచైన అవసరం లేని ఎంట్రీ, రిమోట్ యాక్సెస్, యాక్టివిటీ మానిటరింగ్ వంటి అంతర్నిర్మిత వై-ఫై సౌకర్యాలను కూడా కలిగి ఉంటాయి.

స్మార్ట్ డిజిటల్ లాక్‌లు ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టెంపరరీ యాక్సెస్ కోడ్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. తద్వారా మీ ఇల్లు ఆధునిక ఆకర్షణను పెంచుతూ సురక్షితంగా ఉంటుంది.

3. స్టైలిష్ డెకార్ హ్యాండిల్స్:

అలంకరణ హ్యాండిల్స్ ఒక చిన్న విషయమే అనిపించొచ్చు. కానీ ఇంటి మొత్తం లుక్ ఇవి ప్రభావితం చేస్తాయి. డూర్ హ్యాండిల్స్, క్యాబినెట్ పుల్స్, డ్రాయర్ నాబ్స్ ఆధునికీకరించడం మీ ఇంటీరియర్లను మెరుగుపరచడానికి సరళమైన, ప్రభావవంతమైన మార్గం. మోడర్న్ ట్రెండ్స్ నుంచి వింటేజ్ లుక్ వరకు అనే డిజైన్లలో ఉంటాయివి.

సరైన హ్యాండిల్స్ ఎంచుకోవడం వల్ల మీ గదులకు అధునాతనత స్పర్శను జోడించవచ్చు. పివిడి అని పిలువబడే లేటెస్ట్ ఫినిషింగ్ టెక్నాలజీతో, మీరు ఇప్పుడు మీకు కావలసినట్లుగా థీమ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు.

4. ఫంక్షనల్, స్మార్ట్ లైటింగ్:

మీ ఇంట్లో ఆహ్లాద, సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి లైటింగ్ కీలకం. అందుకే ఇంటిని పునరిద్ధరిస్తే మీ లైటింగ్ ఫిక్సర్లను అప్గ్రేడ్ చేయండి. లేయర్డ్ లైటింగ్, యాంబియంట్, టాస్క్, యాక్సెంట్ లైటింగ్ మీ ఇంట్లో పెద్ద తేడాను తీసుకొస్తాయి. కలర్ టెంపరేచర్, బ్రైట్నెస్. షెడ్యూల్లను సెట్ చేసే అవకాశాలు స్మార్ట్ లైటింగ్‌లో ఉంటాయి.స్మార్ట్ లైట్లు ప్రతి గదిలో సరైన వాతావరణాన్ని సృష్టించగలవు. అలాగే శక్తి-సమర్థవంతమైన ఎల్ఇడి లైటింగ్ వినియోగ ఖర్చులను తగ్గిస్తుంది. మనుషుల కదలికను బట్టి ఆన్ అయ్యే స్మార్ట్ లైటింగ్ ఆధునికతో పాటూ విద్యుత్‌నూ ఆదా చేస్తుంది.

5. ఇన్నోవేటివ్ స్టోరేజ్ సొల్యూషన్స్:

ఇంట్లో మార్పులు చేసేటప్పుడు స్టోరేజీని గరిష్టంగా పెంచడం అనేది ఒక కీలక అంశం. స్టోరేజ్ పరిష్కారాలు మీ ఇంట్లో ప్రతి అంగుళాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడతాయి. దాంతో ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. అంతర్నిర్మిత వార్డ్ రోబ్ లు, బెడ్ స్టోరేజ్, మాడ్యులర్ షెల్ఫింగ్ యూనిట్లు, అండర్-స్టేర్ కేజ్ స్టోరేజ్ వంటి వినూత్న స్టోరేజ్ సొల్యూషన్లు బాగా ఉపయోగకరం. సౌందర్యవంతంగానూ ఉంటాయి.

ఇంటిని పునరుద్ధరించేటప్పుడు తప్పకుండా ఈ మార్పులను చేయండి. కొత్త ట్రెండీ లుక్ తీసుకురండి. మీ సౌకర్యాన్ని పెంచుకోండీ..

టాపిక్

తదుపరి వ్యాసం