Neeraj Chopra luxury house: ఒలంపిక్ విన్నర్ నీరజ్ చోప్రా లగ్జరీ ఇల్లు వివరాలు చూశారా?
12 August 2024, 13:30 IST
Neeraj Chopra luxury house: ఒలంపిక్ పతక విజేత నీరజ్ చోప్రా లగ్జరీ ఇల్లు చూశారా? ఆ ఇల్లు, నీరజ్ చోప్రా కార్ కలెక్షన్ సంబంధించిన పూర్తి వివరాలు తెల్సుకోండి.
నీరజ్ చోప్రా ఇల్లు
ప్యారిస్ ఒలంపిక్స్‌లో 26 ఏళ్ల నీరజ్ చోప్రా జావెలెన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించారు. వరసగా ఒలంపిక్స్‌లో రెండో పతకం సాధించారాయన. టోక్యో ఒలంపిక్స్‌లో కూడా బంగారు పతకం సాధించారు. అప్పుడు ప్రభుత్వాలు అయనకు భారీ నజరానాలు ప్రకంటించాయి. హరియాణా ముఖ్యమంత్రి నీరజ్ చోప్రాకు 6 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. అప్పటి పంజాబ్ ముఖ్యమంత్రి కూడా 2 కోట్ల్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఇలాగే అనేక సంస్థలు అనేక రకాల ఆఫర్లతో నీరజ్‌కు భారీ నజరానాలు, ఆఫర్లు ఇచ్చాయి.
ప్యారిస్ ఒలంపిక్స్‌లో విజయం తర్వాత హరియాణాలోని పానిపట్ దగ్గర్లో ఉండే నీరజ్ చోప్రా ఇంటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పతకం గెలిచాక నీరజ్ చోప్రా వ్యక్తిగత జీవితం తెల్సుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరింగింది. దాంతో నీరజ్ చోప్రా విశాలమైన విల్లా గురించిన వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
నేమ్ బోర్డ్:
విశాలమైన గేటుతో ఉంది నీరజ్ చోప్రా ఇల్లు. ఇంటి గేట్ బయట ఎడమవైపులో ముందుగా కనిపించేది నేమ్ బోర్డ్. దానిమీద పెద్ద ఆంగ్ల అక్షరాలతో చోప్రాస్ (Chopra's) అని రాసి ఉంది. అలాగే దాని మీద గుండ్రని బ్రౌన్ బ్రాక్‌గ్రౌండ్ మీద వసుదైవ కుటుంబకం అని ఆంగ్లంలో రాసి ఉంది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కార్ పార్కింగ్:
గేటు తీయగానే మొదట కనిపించేది ఫోర్ వీలర్ పార్కింగ్ స్థలం. అక్కడ కార్లు పార్క్ చేసి ఉన్నాయి. టోక్యో ఒలంపిక్స్ సమయంలో మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా నీరజ్‌కు పర్సనలైజ్డ్ ఎక్స్‌యూవీ 700 బహుమతిగా ఇచ్చారు. నీరజ్ చోప్రా దగ్గర రెండు కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్, ఖరీదైన టయోటా ఫార్చూనర్ కార్లు ఉన్నాయి.
దీంతో పాటే నీరజ్ చోప్రా బైక్ కలెక్షన్ కూడా ఖరీదైందే. అతని దగ్గర హార్లీ డేవిడ్ సన్ 1200 రోడ్‌స్టర్ బైక్ కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో పాటే మరిన్ని బైకులు నీరజ్ కలెక్షన్‌లో ఉన్నాయి. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో నీరజ్ చోప్రా ఇంట్లో ఒక ట్రాక్టర్ కూడా ఉంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన వాళ్లమని అది గుర్తు చేస్తోంది.
ఇల్లు వివరాలు:
ఇల్లు చుట్టూ పచ్చదనం కనిపిస్తోంది. ఇంటి ఆవరణలో చుట్టూ రకరకాల మొక్కలున్నాయి. ఈ మూడంతస్తుల లగ్జరీ భవనం లేత పీచ్, తెలుపు రంగుల మేళవింపుతో ఉంది. అక్కడక్కడ పుడెన్ ఫినిషింగ్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎంతో విలాసంగా ఉన్న ఈ ఇళ్లు గురించి తెల్సుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగిందిప్పుడు.
కుక్క పేరు టోక్యో:
2008 లో ఒలంపిక్స్ పతక విజేత అభినవ్ బింద్రా నీరజ్ చోప్రాకు గోల్డెన్ రిట్రీవర్ జాతి కుక్కను బహుమతిగా ఇచ్చారు. దాని పేరు టోక్యో. ఆయన మొదటి పతకం గెలిచిన టోక్యో ఒలంపిక్స్‌ను దీని పేరు గుర్తు చేసేలా పెట్టారు.