70 వేలలోపు మంచి బైక్స్.. మైలేజీ సూపర్.. మిడిల్ క్లాస్‌కు పర్ఫెక్ట్-best bikes under 70000 rupees with 70 kmpl good mileage for middle class people honda shine 100 bajaj platina tvs sport ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  70 వేలలోపు మంచి బైక్స్.. మైలేజీ సూపర్.. మిడిల్ క్లాస్‌కు పర్ఫెక్ట్

70 వేలలోపు మంచి బైక్స్.. మైలేజీ సూపర్.. మిడిల్ క్లాస్‌కు పర్ఫెక్ట్

Anand Sai HT Telugu
Aug 11, 2024 06:00 PM IST

Best Bikes Under 70k : ప్రతీ మధ్యతరగతి వ్యక్తి తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ కొనాలి అనుకుంటాడు. అలాంటివారిలో మీరు ఉంటే 70 వేలలోపు కొన్ని బైక్స్ ఉన్నాయి. మీకు తక్కువ ధరతోపాటుగా మంచి మైలేజీని అందిస్తాయి.

టీవీఎస్ స్పోర్ట్
టీవీఎస్ స్పోర్ట్

మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది తక్కువ ధరలో వచ్చే బైక్స్ కోసమే. దానితోపాటుగా మైలేజీ కూడా ఎక్కువ ఇస్తే సంతోషపడిపోతారు. నిజానికి దేశంలో ఉన్నది ఎక్కువగా మధ్యతరగతివారే. బైక్ అనేది ఈరోజుల్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువు అయిపోయింది. దీంతో చాలా మంది మైలేజీ ఎక్కువగా ఇచ్చే బైక్స్ వైపు మెుగ్గు చూపుతున్నారు. అందుకే తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్ ఎంచుకోవాలి. అప్పుడే మన బడ్జెట్‌కి సరిపోతుంది. రూ.70 వేలలోపు ధరలో మంచి మైలేజీని ఇచ్చే బైక్స్ కోసం చూస్తుంటే.. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆ బైకులు ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..

హోండా షైన్

మెుదట హోండా షైన్ 100 గురించి చెప్పుకుందాం. ఈ బైక్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే తక్కువ ధరలో మంచి మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.66,600గా ఉంది. ఇది 7.38 PS గరిష్ట శక్తిని, 8.05 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 98.98 cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్. ఈ హోండా షైన్ 100 68 kmpl మైలేజీని ఇస్తుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ స్టార్టర్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గోల్డ్‌తో సహా వివిధ రంగుల ఎంపికలలో కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది.

బజాజ్ ప్లాటినా

బజాజ్ ప్లాటినా 100 రూ.68,742 ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 7.9 PS పవర్, 8.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 102సీసీ సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. సరికొత్త బజాజ్ ప్లాటినా 100 బైక్ 70 కేఎంపీఎల్ మైలేజీని అందిస్తుంది. ఇది బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ సిల్వర్, బ్లాక్ అండ్ గోల్డ్ వంటి అనేక కలర్స్ ఆప్షన్స్‌లో ఉన్నాయి. హాలోజన్ హెడ్‌లైట్, సింగిల్ పీస్ సీట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. డ్రమ్ బ్రేక్‌ను కూడా కలిగి ఉంటుంది.

టీవీఎస్ స్పోర్ట్

టీవీఎస్ స్పోర్ట్ బైక్ రూ.67,320 నుండి రూ.72,033 ఎక్స్-షోరూమ్ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది 109.7 cc, సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది గరిష్టంగా 8.19 PS శక్తిని, 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. కొత్త TVS స్పోర్ట్ మోటార్‌సైకిల్ 70 kmpl మైలేజీని అందిస్తుంది. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, బల్బ్ స్టైల్ హెడ్‌లైట్, LED DRL, సెల్ఫ్ స్టార్ట్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 112 కిలోలు, 10 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంది.