తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chocolate Oats: ఇంట్లో చాకోలేట్ ఓట్స్ చేసిచ్చారంటే, మీకు ఫ్యాన్ అవుతారంతా

Chocolate Oats: ఇంట్లో చాకోలేట్ ఓట్స్ చేసిచ్చారంటే, మీకు ఫ్యాన్ అవుతారంతా

08 October 2024, 15:30 IST

google News
  • Chocolate Oats: పది నిమిషాల్లో ఇన్స్టంట్ గా చేసుకునే స్నాక్ రెసిపీ చాకోలేట్ ఓట్స్. ఈ స్నాక్ చాలా ఫ్యాన్సీగా, పిల్లలకు, పెద్దలకు నచ్చేలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు మీకు ఫ్యాన్ అయిపోతారు. ఒకసారి ప్రయత్నించండి. 

చాకోలేట్ ఓట్స్
చాకోలేట్ ఓట్స్

చాకోలేట్ ఓట్స్

యమ్మీగా, హెల్దీగా చాకోలేట్ ఓట్స్..

ఓట్స్ అంటే ఏదో ఆరోగ్యం కోసమని బలవంతంగా తినేస్తారు చాలా మంది. కానీ దాన్ని యమ్మీగా తయారు చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఓట్స్ లో చాకోలేట్ ఫ్లేవర్ వచ్చేలా చేస్తే పెద్దలే కాదు, పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

చాకోలేట్ ఓట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 కప్పు ఓట్స్

2 చెంచాల కొకొవా పొడి

పావు టీస్పూన్ ఉప్పు

2 కప్పుల పాలు

2 చెంచాల తేనె

2 చెంచాల చాకోలేట్ తురుము లేదా చాకోలేట్ చిప్స్

తాజా పండ్ల ముక్కలు

చాకోలేట్ ఓట్స్ తయారీ విధానం:

1. ముందుగా ఒక ప్యాన్‌లో ఓట్స్, పాలు, పావు కప్పు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.

2. ఓట్స్ ఉడికిపోయి మెత్తగా అయ్యేదాకా సన్నం మంట మీద ఉడికించుకోవాలి. తర్వాత గ్యాస్ కట్టేయాలి.

3. ఈ ఓట్స్ లోనే కొకొవా పొడి, చాకోలేట్ చిప్స్ లేదా తురుము, తేనె వేసి బాగా కలపాలి.

4. మీద మీకిష్టమైన పండ్ల ముక్కలు ఏవైనా వేసి సర్వ్ చేసుకుంటే చాలు. చాకోలేట్ ఓట్స్ రెడీ అయినట్లే.

ఈ ఓట్స్ మీద స్ట్రాబెర్రీ, అరటిపండ్లు సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. లేదంటే కొద్దిగా పీనట్ బటర్ లేదంటే ఆల్మండ్ బటర్ వేసుకుని తినొచ్చు. వెనీలా ఫ్లేవర్ నచ్చితే వెనీలా ఫ్లేవర్డ్ గ్రీక్ యోగర్ట్ లేదా వెనీలా క్రీం ఒక స్కూప్ పైన వేసుకోవచ్చు. మీకు చియా గింజలు నచ్చితే వాటిని కాసేపు నానబెట్టి ఈ ఓట్స్‌లో కలిపేసి తినేయొచ్చు. ఓట్స్ మధ్యలో ఇవి తగులుతుంటే మంచి రుచి వస్తుంది. అలాగే ఓట్స్ క్రీమీగా ఇష్టం లేకపోతే పాలు తగ్గించి నీళ్లు ఎక్కువగా కలుపుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి వీటిని తయారు చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం