తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : మీరు ఆశపడుతున్నారా? అత్యాశ పడుతున్నారా? ఆశపడండి బాగుంటుంది

Saturday Motivation : మీరు ఆశపడుతున్నారా? అత్యాశ పడుతున్నారా? ఆశపడండి బాగుంటుంది

28 January 2023, 6:09 IST

    • Saturday Motivation : ఆశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే ప్రస్తుతం కాస్త తేలికగా వెళ్తుంది. లేదంటే చాలా ఈరోజు గడవడం చాలా కష్టం అయిపోతుంది. రేపు బాగుంటుందనే హోప్ మనకి ఉన్నప్పుడు ఈరోజు కష్టం మనకి కాస్త తేలికగానే ఉంటుంది. 
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Saturday Motivation : మనిషి ఆశావాది అంటారు. మరి ఆశపడడం తప్పేనా? ఆశపడడం తప్పుకాదు. కానీ అత్యాశ పడడమే అన్ని ముప్పులను తీసుకువస్తుంది. ప్రతి వ్యక్తికి ఆశ అనేది ఉండాలి. అది మీకు రేపు అనే ఆలోచనను తీసుకువస్తుంది. ఈరోజు కుదరలేదా? అయితే రేపు కచ్చితంగా జరుగుతుంది అనే హోప్.. ఈరోజు భారాన్ని చాలావరకు తగ్గిస్తుంది. ఎంతకష్టాన్ని అయినా భరించేలా చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

Garlic Rice: అన్నం మిగిలిపోతే ఇలా వెల్లుల్లి రైస్ చేసి చూడండి, పులిహోర కన్నా అదిరిపోతుంది

ఈరోజు కష్టపడతే రేపు కూర్చొని తినొచ్చు అని చాలామంది అంటారు. దాని అర్థం కూడా అదే. ఈరోజు మనం ఎంత చేయగలమో అంత చేసేద్దాం. ఫలితం ఎప్పుడూ అదే రోజు రాదు. మనం ఎఫర్ట్స్ పెట్టాము. కచ్చితంగా మనకు మంచి ఫలితాలే వస్తాయనే నమ్మకం ఈరోజు పడిన శ్రమను మరిపిస్తుంది. ఒకవేళ రేపటిపై హోప్​ లేకుంటే ఈరోజే నీరసంతో ఆగిపోతాము.

శ్రమ ఏదైనా, ఎంతైనా ఫలితాలు వెంటనే రావు. మనం పడిన శ్రమ ఫలితం రూపంలో రావడానికి టైమ్​ పడతాయని నమ్మాలి. ప్రతిదానికి ఇన్​స్టంట్ ఫలితాలు రావు. కాస్త ఓపికగా.. ఆశతో ముందుకు సాగాలి. మీరు ఎంత ఓపికగా.. ఆశతో ఉంటే.. ఈరోజు మీకు అంత తేలికగా సాగుతుంది. రేపు అన్నది దేవుడికి ఇచ్చి.. ఈరోజు మీరు కష్టపడండి. లేదా మీ ఎఫర్ట్స్ పెట్టండి. ఫలితాలు మాత్రం వెంటనే వచ్చేస్తాయి అనుకోకండి. అలాంటప్పుడే మీ మనసు తేలికగా ఉంటుంది. ఎక్కువ భారం ఉండదు.

మానసిక ఒత్తిడి, భారం, శ్రమ, ప్రెజర్​ను భరించడానికి ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఆరోగ్యం బాగోలేనప్పుడు ఈరోజు మనకి ఏదో అయిపోతుంది అనే ఫీలింగ్.. మిమ్మల్ని మృత్యువు వరకు తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈరోజు ఎలా ఉన్నా.. రేపు నేను బాగుంటాను అనే ఆశ.. మిమ్మల్ని ఆరోగ్యంగా చేస్తుంది. కాబట్టి మనం ఆశపడాలి. కానీ అత్యాశలకు మాత్రం పోకూడదు. ఆశ ఎంత మంచిదో.. అత్యాశ అంత చెడునిస్తుంది. కాబట్టి ఆశ పడడండి. అత్యాశలకు పోయి జీవితాన్ని పాడుచేసుకోకండి.