తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Samsung Galaxy M33 5g స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌!

Samsung Galaxy M33 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై భారీ డిస్కౌంట్‌!

HT Telugu Desk HT Telugu

03 April 2022, 12:13 IST

    • Samsung Galaxy M33 5G స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్లో విడుదలైంది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఆ వివరాలు, ఈ ఫోన్ ఫీచర్లు ఇక్కడ తెలుసుకోండి..
Samsung Galaxy M33 5G
Samsung Galaxy M33 5G (Samsung)

Samsung Galaxy M33 5G

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు Samsung తాజాగా Galaxy M33 పేరుతో మరో 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సరసమైన ధరలలో లభిస్తున్న ఈ సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్‌లో అధిక రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరాలు, మంచి బ్యాటరీ ఇంకా ఎక్సినోస్ చిప్‌సెట్ లాంటి నాణ్యమైన అమరికలు అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ర్యామ్ స్టోరేజ్ ఆధారంగా శాంసంగ్ గెలాక్సీ ఎం33 6GB ర్యామ్/128GB స్టోరేజ్ అలాగే 8GB ర్యామ్/128GB అనే రెండు కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. కాన్ఫిగరేషన్‌ ఆధారంగా ధరలు ఉంటాయి. బేస్ 6GB/128GB మోడల్ ధర రూ.18,999/- గా నిర్ణయించారు. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.. ఎప్పట్నించి అందుబాటులో ఉంటాయి అనే పూర్తి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Samsung Galaxy M33 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.6-అంగుళాల ఫుల్ HD+ ఇన్ఫినిటీ-V డిస్‌ప్లే

ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్స్: 6GB/128GB,  8GB/128GB

ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్

వెనకవైపు 50 మెగా పిక్సెల్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్; ముందు భాగంలో 8MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం, 25W ఫాస్ట్ ఛార్జర్

6GB/128GB వేరియంట్ ధర రూ. 18,999/-

8GB/128GB వేరియంట్ ధర రూ. 20,499/-

M33 5Gలో ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ , కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

బ్లూ, గ్రీన్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్ 8 నుండి Samsung India అలాగే Amazon ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభోత్సవ ఆఫర్ కింద Samsung Galaxy M33 5G కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 2వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే ఈ ఆఫర్ ఉన్నంత వరకు కొనుగోలు చేసేవారికి 6GB/128GB వేరియంట్ ధర రూ. 17,999/-కు అలాగే 8GB/128GB వేరియంట్ ధర రూ. 19,999/- లభిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం